కాల్వ చివరి రైతులకు కష్టాలు తప్పవా..?

కాల్వ చివరి రైతులకు కష్టాలు తప్పవా..?

హుజూర్ నగర్, ముద్ర : వానకాలం రైతుల సాగుకు కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. నేటి వరకు వరుణ దేవుడు కరుణించకపోవడం, మరోపక్క కాల్వల పరిస్థితి కూడా అధ్వానంగా మారిపోవడంతో రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో ఆయకట్టు ప్రాంత రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారే పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ఆయకట్టు ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో కాల్వల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఫలితంగా కాల్వ చివరి రైతులకు నీరు అందే పరిస్థితులు కనిపించడం లేదు. లింగగిరి మేజర్ పరిధిలోని పంట కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైంది. గత కొంతకాలంగా కాల్వ చివరి రైతులు సక్రమంగా నీరు అందకపోవటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణంలో మధ్య నుండి వెళ్తున్న లింగగిరి మేజర్ అనేక అక్రములకు గురి అయింది. ఇటీవల శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి రోడ్డు విస్తరణ క్రమంలో కాలువ కట్టలమైన ఆక్రములను తొలగించారు. మేజర్ నుండి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వంట కాలువల పరిస్థితి అద్వానంగా ఉంది. కాలువల్లో పిచ్చి మొక్కలు పురీతంగా పెరిగిపోయాయి. కాలువ కట్టలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.  కాలువ కట్టల పైనుండి ప్రయాణం చేయలేని పరిస్థితి ఉంది. దీనివలన కాలువ చివరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ కట్టలు, తూములు, డ్రాపులు, పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. వెంటనే ఎన్ ఎస్ పి అధికారులు చర్యలు తీసుకొని కాలువలకు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు. కాలువ నీరు వదిలిన తర్వాత మరమ్మత్తులు చేయటం సాధ్యం కాదని రైతులు తెలిపారు. అధికారులు చర్యలు తీసుకొని కాల్వ చివర రైతులకు నీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు . పంట కాలువ కింద సుమారు1ooo ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉంది. రైతాంగాన్ని ఆదుకోవాలని కాలువ చివరి రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం ప్రధాన కాలువలకు మరమ్మత్తులు చేస్తూ లైనింగ్ పనులు కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో మేజర్ల కింద ఉన్న పంట కాలువలకు కూడా మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. వాతావరణ పరిస్థితులు రైతాంగానికి అనుకూలంగా కనిపించడం లేదని పలువురు రైతులు తెలిపారు. ఈ క్రమంలోనే త్వరగా మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.