ఉపాధ్యాయురాలు కొల్లు రామ తులసికి గౌరవ డాక్టరేట్

ఉపాధ్యాయురాలు కొల్లు రామ తులసికి గౌరవ డాక్టరేట్

కోదాడ, ముద్ర:కోదాడ పట్టణం నయానగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కొల్లు రామ తులసికి ఆసియా ఇంటర్ నేషనల్ కల్చర్ రిసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించినట్లు రామ తులసి ఆదివారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. విద్య, సామాజిక సేవా రంగాల్లో చేస్తున్న కృషిని గుర్తించిన యూనివర్సిటీ యాజమాన్యం సేవా రంగంలో ఈ అవార్డు కు ఎంపిక చేసినట్లు తెలిపారు.త్వరలో అవార్డు ప్రధాన కార్యక్రమాలు ప్రకటిస్తామని యూనివర్సిటీ యాజమాన్యం ప్రకటించింది. కాగా రామ తులసి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జీవ శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. రామ తులసికి ఈ అవార్డు ప్రకటించడం పట్ల పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధికారులు, మిత్రులు, బంధువులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.