చివరి మజిలీకీ సర్వం సిద్ధం

చివరి మజిలీకీ సర్వం సిద్ధం

పేటలో మహాప్రస్థానం రేడీ

అంత్యక్రియలు మొదలు అపర కర్మలదాకా

అన్నింటికీ వెసులుబాటుగా

అద్దె ఇండ్లలో ఉండే వారికీ అనువుగా 

బాధను మరిపిస్తూ.....ఆత్మీయతను పంచుతూ

24 అడుగుల ఆదిబిక్షువు సాక్షిగా 

అంతిమ ఘడియాల్లోనూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా

మహాప్రస్థానం పైనా మంత్రి జగదీష్ రెడ్డి మార్కే

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: మానవ జీవితంలో చివరి మజిలీకి సైతం పట్టణ ప్రజలకు ఎటువంటి అవాంతరాలు ఉండకుండా నిర్మితమౌతున్న మహాప్రస్థానం ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది.అంత్యక్రియలు మొదలు అపర కర్మల వరకు జరుపుకునేందుకు వీలుగా నిర్మితమైన మహాప్రస్థానంపై స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు.అన్నీ తానై తానే అనై అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ లా పరకాయ ప్రవేశం చేసి నిర్మించిన కట్టడం అంతిమ ఘడియాల్లోనూ అహ్లాదాన్ని పంచే తీరులో నిర్మించిన కట్టడంగా పట్టణ ప్రజలు అభివర్ణింస్తున్నారు.ఆ మాటకు వస్తే సూర్యపేట జిల్లా నిర్మాణమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది.చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయాలు, సమీకృత మార్కెట్,మినీ ట్యాన్క్ బండా,యస్ పి కార్యాలయాల నిర్మణాలతో శోభయామనంగా తీర్చిదిద్దుకున్న సూర్యపేట జిల్లా కేంద్రంలో సుందరీ కరణకుఉన్న అవాంతరాలు తొలిగి పోవడంతో ముమ్మరంగా జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులకు తోడు అంతే స్థాయిలో నిర్మితమౌతున్న మహా ప్రస్థానం తుది మెరుగులు దిద్దుకుంటుంది. మానవ జీవితానికి తొలి మజిలీ మెడికల్ కళాశాల నిర్మాణం సూర్యపేటకు ఎంతటి శోభనిచ్చిందో...చివరి మజిలీకి చేరుకునే మహాప్రస్థానం అదే పేట కు అంతే  శోభను పంచుతుంది.అటువంటి నిర్మాణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ సహకారాలతో చెరగని ముద్ర వేసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి ఆ చంద్రార్కం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతారని పట్టణ ప్రజలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మానవ జీవితంలో కోరికలు అనంతాలు....జీవితంలో ఏదైనా అవుతారో లేదో తెలియదు కాని జాతస్య మరణం ధ్రువం అన్న భగవద్గీత సారాంశాన్ని అర్థం చేసుకున్నప్పుడు సూర్యపేట లో నిర్మించిన మహాప్రస్థానం నిర్మాణ ప్రాధాన్యానికి తత్వం భోదపడుతుంది.ఎటూ తిరిగినా ఏమి చేసినా అంతిమంగా వచ్చేది ఇక్కడికే అని...అటువంటి బాధాతప్త హృదయాలతో మహాప్రస్థానంకు చేరుకునే వారికీ అనువుగా నిర్మించిన నిర్మాణమే సూర్యపేట మహాప్రస్థానం.అద్దె ఇంట్లో ఉంటూ అకాల మరణాలు సంభవించినప్పుడు పడే బాధలు అధ్యయనం చేసిన మీదట వారికి అండగా ఉండేందుకు గాను అంత్యక్రియల మొదలు అపరకర్మల దాకా ఇక్కడే చేసుకునే వీలుగా మంత్రి జగదీష్ రెడ్డి చేసిన ఏర్పాట్లు ఆ బాధలో ఉన్న వారికి ఓదార్పు తో పాటు ఆహ్లదాన్ని పంచేలా ఉన్నాయి.దేశరాజధాని హస్తిన కు పోయినప్పుడు సైడ్ సియింగ్ అంటూ మొదలు పెడితే జాతిపిత మహాత్మాగాంధీ మొదలు ఇందిర,రాజీవ్, వంటి ప్రముఖుల సమాధుల వరకు సందర్శించడం ఆనవాయితీ.అక్కడికి పోయినప్పుడు సమాధుల దగ్గర లేము ప్రకృతి ప్రసాదించిన వనంలో ఉన్నామా అన్నట్లు తీర్చి దిద్దిన ఢిల్లీలోని బాపు ఘాట్, శక్తిస్థలి నిర్మాణాలను మైమరిపించే రీతిలో పేట లో నిర్మించిన మహాప్రస్థానం కూడా రేపటి సూర్యపేట పట్టణ సైడ్ సియింగ్ లో ఒక భాగమే అవుతోంది.

చూడగానే చూపరులకు అది శ్మశాన వాటిక కాదు ఇక్కడ కుడా అహ్లాదాన్ని పంచుకువొచ్చు అన్నంత ఉట్టి పడేలా 24 అడుగుల ఆదిబిక్షువు(శివుడి)ప్రతిమ...ప్రత్యేక పూజా మందిరం,అందమైన గ్రీనరీ, గార్డెనింగ్,ఫుడ్ స్టోరేజ్ షెడ్లు,వాహనాల పార్కింగ్ మొదలుకుని ఇండ్లలో వీలు కానీ వారు ఇక్కడే అపరకర్మలు చేసుకునేందుకు వీలుగా నిర్మించిన గదులు,మల,మూత్ర విసర్జన శాలలతో విశాలంగా నిర్మించిన సూర్యపేట మహాప్రస్థానంలో అంతిమ ఘడియాల్లో నూ బాధను మై మరిపిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచేలా ఏర్పాటు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి కి హ్యాట్సాఫ్ మరి.