కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన

కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే భజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై బిజెపి నేతలు శుక్రవారం నిర్మల్ లో నిరసనలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా బోయివాడ హనుమాన్ దేవాలయం వద్ద నిరసన వ్యక్తపరుస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.