BRS MLC kavitha ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ కార్యకర్తల కర్తవ్యం

BRS MLC kavitha ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ కార్యకర్తల కర్తవ్యం
  • మంచి పనులు కేసీఆర్ కే సాధ్యం
  •  ఆర్మూర్ లో జీవన్ రెడ్డి విజయం ఖాయం
  • మాక్లూర్ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యం కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అభివృద్ధి పనులకు చిరునామా  సీఎం కేసీఆర్ అన్నారు.  జరిగిన అభివృద్ధిని, అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో మంగళ వారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి చామకూర మల్లా రెడ్డితో కలిసి  కవిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఒకప్పుడు బి ఆర్ ఎస్ పార్టీని అవహేళన చేశారని, కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ ఇంటికి మూడు పథకాలు అందించే స్థాయికి ఎదిగిందన్నారు. పది మందికి సాయం చేస్తేనే తమ పార్టీ నాయకులు ప్రశాంతంగా నిద్రిస్తారని కితాబునిచ్చారు.  కార్యకర్తల త్యాగాల ఫలితంగా తెలంగాణా అని, దీని ఫలితం కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో సాకారమైందని అన్నారు. 

నిజామాబాద్ లో ఈ ఎస్ ఐ ఆసుపత్రి ESI Hospital in Nizamabad

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు1.33 లక్షల బీడీ కార్మికులకు  పెన్షన్ అందుతోందని, వీరి కోసం ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆస్పత్రిని నిర్మిస్తే కామారెడ్డి ప్రాంతంలో ఉన్న కార్మికులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంఖ్య కూడా అధికంగా ఉందని, వారికి బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు.

జీవన్ రెడ్డి గెలుపు ఖాయం

Armor MLA Jeevan Reddy ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో కంటే అధిక మెజారిటీతో వచ్చే ఎన్నికల్లో గెలుస్తారన్న విశ్వాసం ఉందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి మీద ఎవరైనా పోటీ చేయాలనుకుంటే "మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే" అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు.