హోమ్ మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న బీజేపీ నేతలు - ఎక్కడికక్కడ అరెస్టులు

హోమ్ మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న బీజేపీ నేతలు - ఎక్కడికక్కడ అరెస్టులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర హోంమంత్రి ఈద్గా ప్రారంభోత్సవానికి మంగళవారం నిర్మల్ వచ్చిన సందర్భంగా బిజెపి శ్రేణులు ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్నాయి. కాన్వాయ్ కి అడ్డంగా బిజెపి నేతలు, కార్యకర్తలు దూసుకు రావడంతో పోలీసులు వారిని నిలువరించేందుకు ఎక్కడికక్కడే అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ భూములను మతపరమైన నిర్మాణాలకు కేటాయించకూడదన్న నిబంధనలను అతిక్రమించడం, ఈద్గా కు కేటాయించటం పట్ల  నిరసన వ్యక్తం చేస్తూ బిజెపి శ్రేణులు కాన్వాయ్ ముందుకు వచ్చాయి. అంతకు ముందే బిజెపి నేతల ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించారు. దీంతో పట్టణంలో కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.