ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్
  • ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా
  • కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి మండలంలోని కొండాపూర్, చిగురుమామిడి, లంబాడిపల్లి గ్రామాలలో మంగళవారం ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...చిగురుమామిడి మండల రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న   ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం క్వింటాలకు రూ. 2060/-   మద్దతు ధర పెడుతుందని,ఇలా రైతుల నుండి సేకరించిన ధాన్యం డబ్బులను వారం రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని  పేర్కొన్నారు. దళారుల నమ్మి మోసపోవద్దని రైతు శ్రేయస్సు కోసం  దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్నారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధి దారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే రంజాన్ తోఫా కానుకలను ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి, తహశీల్దారు ముబీన్ అహ్మద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ రామోజు రజిత కృష్ణమాచారి, కొండాపూర్ సర్పంచ్ పెద్దపల్లి భవాని అరుణ్ ,వైస్ చైర్మన్ కర్వేద మహేందర్ రెడ్డి, మండల రైతుబంధు సమితి బాధ్యతలు పెనుకుల తిరుపతి, ఏపీఎం మట్టెల సంపతి, డీసీఎంఎస్ మండల చైర్మన్ కూన మహేందర్, నాయకులు మామిడి అంజయ్య, సాంబారి కొమరయ్య, బెజ్జంకి రాంబాబు తదితరులు పేర్కొన్నారు.