మహిళలకు చట్టాల పై అవగాహన కల్పించాలి

మహిళలకు చట్టాల పై అవగాహన కల్పించాలి
  • ప్రగతిలో కరీంనగర్ ముందంజ
  • రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి

 ముద్ర ప్రతినిధి,కరీంనగర్ : మహిళలకు చట్టాల పై అవగాహన కల్పించాలని, జిల్లాలో మహిళల సాధికారత దిశగా చేపడుతున్న కార్యక్రమాలలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ముందంజలో నిలిచిందని  రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి జిల్లా యంత్రంగానికి  ప్రశంసించారు.  బుధవారం జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గోన్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు మద్యాహ్నం జిల్లా కేంద్రంలోని కెసిఆర్ గెస్ట్ హౌజ్ లో జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్, జిల్లాలోని పలువురు మహిళా అధికారులతో  మహిళలకు చేపడుతున్న పలు పథకాల అమలు, ప్రగతిపై సమీక్షించారు.  ఈ సందర్బంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్  మాట్లాడుతూ, మహిళల కొరకు జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.  అదే విధంగా మహిళలు ఎదుర్కోంటున్న సమస్యలను గురించి జిల్లాలో ప్రతి మూడు నెలలకోసారి మానిటరింగ్ కమిటి సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు.  

మహిళా చట్టాలపై జిల్లాస్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.  సీనియర్ సిటిజన్ కేసులను సత్వరం పరిష్కరించేలా చూడాలని, గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలో డిఆర్డిఓ లో జెండర్ కమిటిని రూపొందించాలని,  పోలీస్ స్టేషన్ లలో ఎవైన కేసులు నమోదైనప్పుడు వారికి చట్టాలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, వివిధ ప్రాంతాలలో మహిళా చట్టాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.  గతేడాదితో పోలిస్తే తగ్గిన లింగ నిష్పత్తి దానిపై దృష్టి సారించాలని, బేటీ బచావో బేటీ పడావో, చైల్డ్ ఫ్రెండ్లీ, సాధారణ డెలివరీ సంఘటన, పోక్సో కేసుల పరిహారం, దత్తత కేసులు, విద్యా విభాగం, పెండింగ్ కేసుల సమీక్ష, లింగమార్పిడి కార్డు, శిక్షణ, ట్రాన్స్‌జెండర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వెళ్లకుండా, సైబర్ నేరాలపై అవగాహన, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పాష్ చట్టంపై యునిసెఫ్ ప్రాజెక్ట్ తదితర అంశాలపై చర్చించారు.  జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించిన మహిళా కమీషన్  ఈ సందర్బంగా కలెక్టర్, సిపిని  మెమోంటో, షాలువాలతో సత్కరించారు. 

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, జిల్లాను అనిమియా ముక్త్ కరీంనగర్ గా తీర్చిదిద్దేలా జిల్లాలోని ప్రతిమహిళకు రక్తహినత పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, రక్తహీనత స్థాయిని బట్టి మందులు, చికిత్సలను అందించడం జరుగుతుందని  తెలిపారు.  రక్తహీనతను హెల్త్ డైరీయాప్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.  స్వదార్ హోమ్స్, చిల్డ్రెన్ హోమ్ లను తనిఖీ చేయడం జరుగుతుందని, సినియర్ సిటిజన్స్ కొరకు డే కేర్ సెంటర్ ను జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.  కేసిఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణి కి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని,  ఆరోగ్య కార్యక్రమాలపై ఏఎన్ఎం, అంగన్ వాడీలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు.    ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్  సుబ్బారాయుడు, మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణకుమారి, డైరెక్టర్ శారద,శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్, మహిళా కమీషన్ సభ్యులు షైన్ అఫ్రోజ్ కుమ్ర ఈశ్వరి బాయి, కొమ్ము ఉమాదేవి గద్దల పద్మ శుద్ధం లక్ష్మి  కటారి రేవతి, డిఆర్డిఓ శ్రీలత, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, డిడబ్ల్యూఓ సబితా కుమారి, తదితరులు పాల్గోన్నారు.