బెదిరింపులకు పాల్పడుతున్నా యూట్యూబర్ పై కేసు నమోద్ 

బెదిరింపులకు పాల్పడుతున్నా యూట్యూబర్ పై కేసు నమోద్ 

మెట్ పల్లి, ముద్ర: తన యూట్యూబ్ ఛానల్ లో తప్పుడు వార్త ప్రసారం చేసి, బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ వ్యక్తి పై వచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు. గట్టిపెల్లి రాజశేఖర్ అనే వ్యక్తి విలేకరి అని చెబుతూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడని. అందులో భాగంగా మహ్మద్ షాకీర్ సిద్ధికి అనే వ్యక్తి తో నీ మీద పోలీస్ స్టేషన్ లో పిర్యాద్ వచ్చింది.

ఆ పిర్యాద్ గురించి నా ఛానల్ లో ప్రసారం చేయకుండా ఉండేందుకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా షాకీర్ తన కొడుకు ఫోన్ పే నుండి ఐదు వేల రూపాయలు పంపించడం జరిగింది. కానీ రాజశేఖర్ మళ్ళీ వాటిని తిరిగి పంపించి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ షాకీర్ ఇవ్వలేదు. దింతో డబ్బులు ఇవ్వకపోవడంతో తన యూట్యూబ్ ఛానల్ లో తాను ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నానని అసత్యపు వార్తను ప్రసారం చేసి పరువుకు భంగం కలిగించాడని అన్నారు. అసత్యపు వార్తల పేరుతో తన పరువుకు భంగం కలిగించడంతో పాటు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న గట్టిపల్లి రాజశేఖర్ అనే వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని షాకీర్ పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.