బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి: జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి: జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వసంత మాట్లాడుతూ బి జే పీ రాష్ట్ర అధ్యక్షుడగా ఉన్న బండి సంజయ్ మహిళా అనే గౌరవం లేకుండా కవితపై అనుచిత వాక్యాలు చేయడం మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.

మహిళా హక్కుల కోసం పోరాడుతున్న కవితపై బిజెపి కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ వాక్యాలు చేయడం బాధాకరమన్నారు. అనంతరం మహిళ జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఏఎంసి చైర్మన్ తో కలిసి ఎస్పీ కార్యాలయనికి ర్యాలీగా తరలివెళ్లి జిల్లా ఎస్పీ భాస్కర్ బండి సంజయ్ ని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు.