వెల్గటూర్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల తీరే వేరు..

వెల్గటూర్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల తీరే వేరు..
  • డ్యూటీలు తక్కువ, అనధి కార సెలవులే ఎక్కువ అంటున్న  సిబ్బంది                                           
  • వచ్చామా, పోయామ అన్నట్టు వ్యవహారం                                                                             
  • సభలు, సమావేశాల విషయం లో సభ్యులకు, ముఖ్య మైన వ్యక్తులకు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం                           
  • నిధుల కొరతన లేక అధికారుల సమన్వయ 'లోపమా " అర్థం కావడం లేదంటున్న ప్రజా ప్రతినిధులు                              

వెల్గటూర్, ముద్ర : వెల్గటూర్ మండల పరిషత్ కార్యాలయం లో పని చేస్తున్న కొందరు ముఖ్యమైన అధికారుల తీరే వేరుగా అన్నట్లుగా వ్య వహారి స్తున్నారు. డ్యూటీలకు తక్కువగా హాజరౌతు, అనధికార సెలవులల్లోనే ఎక్కువగా గడుపుతున్నారని అందులో పని చేస్తున్న సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు.   మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమాలను మండల పరిషత్ సభ్యులకు గాని మండలంలో గల ముఖ్య మైన నాయకులకు, వ్యక్తులకు సమాచారం ఇవ్వకుండానే నిర్వహిస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతుంది. నిధుల కొరతన లేక అధికారుల సమన్వయ 'లోపమా " అర్థం కావడం లేదంటు కొందరు ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కాగా  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకొని  తెలంగాణ అవతరణ దినోత్సవ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుండగా, మొదటి రోజు వెల్గటూర్ మండల పరిషత్ కార్యాల యంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా నామ మాత్రంగానే అధికారులు నిర్వహించారు. ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తున్న  ఏ అధికారిక కార్యక్రమాలు అయినా  ఇక్కడ ఇదేవిధంగా జరపడం పట్ల మండల పరిషత్ సభ్యులు, ముఖ్యమైననాయకులు, వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా మండల పరిషత్  అధికారులు స్పందించి సమన్వయంగా పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలని  సూచిస్తున్నారు. లేనిపక్షంలో అధికారుల పనితీరుపై  జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు..