పదికి పది సాధించిన విద్యార్థినీలకు సన్మానం

పదికి పది సాధించిన విద్యార్థినీలకు సన్మానం

ముద్ర, మల్యాల: మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని పలువురు విద్యార్థినీలు పదవ తరగతిలో 10కి 10 జీపీఏ సాధించిన సందర్బంగా గురువారం సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక ఉపసర్పంచ్ కొండబత్తిని త్రినాధ్ ఆధ్వర్యంలో  మ్యాన పావని, సంద మైత్రిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పద్మశాలి సంఘం నాయకులు ముల్క మల్లయ్య, బాలే సంజీవ్, నవీన్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.