దాడి పై పోరాటం అభినందనీయం హుమన్ రైట్స్ మహిళ సెల్ జాతీయ అధ్యక్షురాలు రానా తబస్సుం

దాడి పై పోరాటం అభినందనీయం హుమన్ రైట్స్ మహిళ సెల్ జాతీయ అధ్యక్షురాలు రానా తబస్సుం

మెట్‌పల్లి ముద్ర: జగిత్యాల జిల్లా కేంద్రం లో ముస్లిం యువతి పై ఎస్ ఐ దాడికి వెంటనే స్పందించి యువతి రక్షణ కోసం పోరాటం చేసి న్యాయం జరిగేందుకు కృషి చేయడం అభినందనీయమని హుమన్ రైట్స్ మహిళ సెల్ జాతీయ అధ్యక్షురాలు రానా తబస్సు అన్నారు. గురువారం ఆమే పట్టణ మార్కాజి ఇంతేజామీ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా నివాసానికి వచ్చి ఆయనను సన్మానించి దాడి సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.

రానా తబస్సు మాట్లాడుతూ. న్యాయం వైపు నిలబడి పోరాటం చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. షేక్ సాదక్ హుస్సేన్, అబ్దుల్ నయీమ్, షేక్ ఫెరోజ్, రహీముద్దీన్, అస్లం, అజీజ్, ముదస్సిర్, జావిద్, ఇలియాస్, షేక్ సిరాజ్, సద్దాం, అబ్బాస్, ఎజాజ్, మతిన్, వసీం, నాజిమ్ లు ఉన్నారు.