ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు 

ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు 

ముద్ర, మల్యాల:తొలి ఏకాదశి వేడుకలను గురువారం మల్యాల మండలంలో హిందువులు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్బంగా ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివడంతో ఆలయాలు కిటకిటలాడాయి.

  •  కొండగట్టులో...

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మూడు గర్బాలయాల్లోని స్వామి వార్లకు, అమ్మవారికి అభిషేకాలు, పట్టువస్త్రాలంకరణ, నాగవల్లి అర్చన, తదితర కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.