బిఆర్ ఎస్  నిరంకుశ పాలనకు నిదర్శనం ఎమ్మెల్సీ ఫలితాలు...

బిఆర్ ఎస్  నిరంకుశ పాలనకు నిదర్శనం ఎమ్మెల్సీ ఫలితాలు...

మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి
ఎమ్మెల్సీ గెలుపు ఫై బిజెపి సంబరాలు 


ముద్ర ప్రతినిధి, జగిత్యాల: హైదరాబాద్, రంగా రెడ్డి, పాలమూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన  అభ్యర్థి ఎ. వెంకట్ నారాయణ రెడ్డి  విజయం సాధించిన సందర్భంగా జగిత్యాలలో బిజెపి నాయకులు సంబరాలు నిర్వహిచారు. బిజెపి రాష్ట్ర నాయకులు ముదుగంటి రవింధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో  వేరు వేరుగా జగిత్యాల పట్టణంలో తహసిల్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి, స్వీట్స్ పంపిణి చేసి   సంబరాలు నిర్వహించారు.  ఈ సందర్మాబంగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బిజెపి నాయకురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ బిఆర్ ఎస్  నిరంకుశ పాలనకు ఈ ఎమ్మెల్సీ  ఎన్నిక నిదర్శనమని అన్నారు. నిరంకుశ పాలనకు పాడకట్టే రోజులు మొదలయ్యాయని ఇది రాబోయే ఎన్నికలకు సెమీఫైనల్స్ అని ఫైనల్లో కూడా ఫలితాలు ఇలానే ఉంటాయని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో  రైతులు, మహిళలు, ఉపాధ్యాయులు ఎవరు కూడా సంతోషంగా లేరని అన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను 317 జీవో తీసుకువచ్చి వారి జీవితాలతో చెలగాటమాడుతు వారిని రోడ్డున పడవేశారని అన్నారు. టి ఎస్ పి ఎస్  పేపర్ లీకులతో విఫలమైన ప్రభుత్వన్ని నిలదీసి నిరుద్యోగుల పక్షాన నిలబడేందుకు హైదరాబాదులోని గన్ పార్క్ వద్దకు నిరశన తెలిపేందుకు వెళ్తే బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లను  అరెస్టు చేయడం బాధాకరమన్నారు. బిజెపి రాష్ట్ర నాయకుడు ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ  ఈ విజయం రాబోయే శాసన సభ ఎన్నికలకు బీజేపీ పార్టీకి ఒక బూస్టింగ్ కాబోతున్నదని, బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం పై ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత కోపం,వ్యతిరేకత ఉందో ఈ విజయమే సమాధానం చెపుతున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో  బిజెపి నియోజక వర్గ ఇంచార్జి మదన్మోహన్,  సీనియర్ నాయకులు ఎసిఎస్ రాజు, పన్నాల తిరుపతి రెడ్డి , భూమి రమణ, రాజు, చీటి చంద్రశేఖర్ రావు,  సుగుణాకర్ రావు, జనార్దన్ రెడ్డి,  మారుతీ, రాజేందర్ , ప బిట్టు, విష్ణు, మహేందర్, పొలాస సత్తి , వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.