చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలి..  మహబూబాబాద్ జిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్ 

చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలి..   మహబూబాబాద్ జిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్ 

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్:నేరం చేసిన వారెవ్వరూ శిక్షనుండి తప్పించుకోకూడదని, చట్టపరంగా నేరం చేసిన వారికి శిక్ష పడేలా పోలీస్ శాఖ కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. 
 మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హల్  లో శుక్రవారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు,అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలతో జిల్లా  ఎస్పీ శరత్ చంద్ర పవార్  నెలవారి నేరసమీక్ష సమావేశం నిర్వహించారు.
అందులో బాగంగా ముందుగా జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో పెండింగులో ఉన్న కేసుల వివరాలను, యుఐ కేసులను అడిగి పెండింగ్ కు గల కారణాలను  తెలుసుకున్నారు. పెండింగులో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.


ఈ నేర సమీక్ష సమావేశంలో   ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ.. తమ పరిదిలో జరిగే నేరాల లో పకడ్బందీగా విచారణ చేసి నిందితులపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు సూచించారు. కేసులు విచారణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని,ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి భాదితులకు న్యాయం చేకూరేలా పని చేయాలని అధికారులకు తెలిపారు. 
ప్రతి కేసు విచారణలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని పకడ్బదీగా విచారణ చేపట్టాలని, పార్ట్-1, పార్ట్-2 స్టేట్మెంట్ రికార్డ్, సిడిఎప్ ఫీల్ చేయుట, పోటోస్ , ప్రాపర్టీ సీజ్, నిందితుల వివరాలు ఎంట్రి చేయట, రిమాండ్ డైరీ చార్జీషీట్ ఫీల్ చేయుట తదితర అంశాల పై మాట్లాడారు. ఆయా కేసులలో ఫైల్ లను పరిశీలించి ఎస్ఎహెచ్ఓ లకు తగు సూచనలు చేశారు.
పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్తులకు శిక్షలు పడేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన విధులను ఖచ్చితంగా పాటించేలా అధికారులు ఎప్పటికప్పుడు వారికి తగు సూచనలు చేయాలని అదేశించారు. ఓఈ లు ఎవరు కుడా పెండింగ్ లో ఉంచుకోవద్దు అని, ఆయా వర్టికల్ కు సoబందించి సిబ్బంది పనితీరును రోజు వారిగా సమీక్షించుకోవాలని ఎస్సై లకు సూచించారు. ప్రాపర్టీ నేరాల పై నిఘా ఉంచి దృష్టి సాధించాలని అన్నారు. అనుమానితులు, రౌడిషీట్స్ పైన అధికారుల నిఘా ఉండాలన్నారు.
నేరాల నియంత్రణలో, చేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి  ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. 5ఎస్ విధానంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలని,ఫైళ్లను క్రమ పద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య,మహబూబాబాద్ ఇంఛార్జి డీఎస్పీ రమణ బాబు, తొర్రూరు డిఎస్పీ రఘు, ఏఅర్ డిఎస్పీ జనార్ధన్ రెడ్డి,సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు