అనుమతులు లేని కట్టడాలపై చర్యలు

అనుమతులు లేని కట్టడాలపై చర్యలు

మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: భవనాలు నిర్మించేవారు ముందస్తు అనుమతులు పొందాలని అనుమతులు లేని కట్టడాలను తొలగిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. మహబూబాబాద్ లో మంగళవారం ఐడిఓసి లోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ శశాంక నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  శశాంక మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని విజ్ఞప్తి చేస్తూ ముందస్తు అనుమతి పొందకుండా నిర్మించిన కట్టడాలను తొలగించడం జరుగుతుందని తెలియజేశారు.

సంబంధిత అధికారులు టీం గా ఏర్పడి పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వ ఉత్తర్వులు 58 దృష్టిలో పెట్టుకొని మిగతా వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేని కట్టడాలకు విద్యుత్ సౌకర్యాలు కానీ త్రాగునీటి కనెక్షన్లు ఇవ్వరాదన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాషఅభినవ్, ఆర్డీవోలు కొమరయ్య, రమేష్, మున్సిపల్ కమీషనర్లు ప్రసన్నరాణి,రాజు, మున్వర్, కుమార్ తహసిల్దార్లు రాంప్రసాద్,స్వాతిబిందు, ప్రసాద్, ఇమ్మానియేల్, తదితరులు పాల్గొన్నారు.