మానుకోట అభివృద్దే ధ్యేయం... మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి

మానుకోట అభివృద్దే ధ్యేయం... మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: మానుకోట అభివృద్దే ధ్యేయమని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసి కట్టుగా పనిచేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
 మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ శశాంక, జెడ్పి చైర్మన్ ఆంగోత్ బిందు, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్ లతో కలిసి  మంత్రి సత్యవతి రాథోడ్ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలు, ఇంజనీరింగ్ కళాశాల భవనం నిర్మించేందుకు అనువైన స్థలం పరిశీలించారు.


ముందుగా మంత్రి రామచంద్రపురం కాలనిలో నిర్మించిన రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించారు. ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. పక్కనే  గురుకుల భవనం నిర్మించేందుకు కేటాయించిన స్థలాన్ని  మంత్రి పరిశీలించారు. అనంతరం బయ్యారం రోడ్ లో  ఆర్తి గార్డెన్ వద్ద జిల్లాలో నిర్మించ తలపెట్టిన ఇంజనీరింగ్ కళాశాల  భవనం కొరకు కేటాయించిన 50 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ.. సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ... జిల్లా అభివృద్దే ధ్యేయంగా పెట్టుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో ముందుకుపోతున్నామన్నారు. ఇప్పటికే జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా నర్సంపేట నుండి మహబూబాబాద్ మీదుగా మరిపెడ వరకు నిర్మించడం జరిగిందని, తొర్రుర్ నుండి నెల్లికుదురు మీదుగా మహబూబాబాద్ వరకు జాతీయ రహదారి పనులు మొదలు కానున్నాయన్నారు.

పట్టణ అభివృద్ధిలో భాగంగా రింగ్ రోడ్డు కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడడం అభివృద్ధి వేగవంతం అయ్యిందన్నారు. పట్టణాన్ని నలుదిక్కులా అభివృద్ధి పరిచేందుకు 50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికే మరిపెడకు వెళ్లే జాతీయ రహదారి వద్ద ఉన్న సాలార్ తండా వద్ద ఐడిఓసి భవనాన్ని నిర్మించి ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అలాగే తొర్రుర్ రోడ్ లో శనిగపురం వద్ద నర్సింగ్ కళాశాలను నిర్మించుకున్నామని, మెడికల్ కళాశాల నిర్మాణంలో ఉందన్నారు. నర్సంపేట రోడ్ కు ఇంజనీరింగ్ కళాశాల నిర్మించుకోబోతున్నా మన్నారు. ఆర్వోబి నిర్మాణంతో పట్టణం వెలుపల ఉన్న నెల్లికుదురు, కేసముధ్రం రహదారులు కలువ నున్నాయని, కేసముధ్రం నర్సంపేట రహదారులు మాత్రమే కలుపవలసి ఉందన్నారు. వేసవిలోనే పనులు మొదలవుతాయని, అంచలంచలుగా అభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్ వెంట  ఆర్డీఓ కొమరయ్య, జెడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి,రోడ్లు భవనాల అధికారి తానేశ్వర్, మున్సిపల్ కమీషనర్ ప్రసన్నరాణి, గురుకులాల ఆర్సీఓ రాజ్యలక్ష్మి, తహసీల్దార్ నాగభవాని తదితరులు ఉన్నారు.