ప్రభుత్వ ఆసుపత్రిని అందంగా తీర్చిదిద్దాలి...మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక..

ప్రభుత్వ ఆసుపత్రిని అందంగా తీర్చిదిద్దాలి...మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక..

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: హబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని అందంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మహబూబాబాద్ లో బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులతో కలెక్టర్ శశాంక సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. ఆసుపత్రి వాతావరణం అహ్లాదకరంగా ఉంచాలని అలాగే అందంగా తీర్చిదిద్దాలన్నారు.

ముందుగా హాస్పిటల్ లో డ్రైనేజీ సరి చేయించాలని మురుగు నీరు ఎక్కడ నిలువకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆస్పత్రి భవనానికి రంగులు వేయించాలన్నారు.

ఆసుపత్రి ఆవరణ మధ్యలో ఫౌంటెన్ నిర్మించేందుకు ఆర్కిటెక్చర్ తో డిజైన్ తీసుకోవాలన్నారు. హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని జన ఔషధీ తరలించి జనరిక్ స్టోర్ లను కూడా ల్యాబ్ వైపు ఏర్పాటు చేయాలన్నారు.

జనరేటర్ ను తొలగించాలని, అందులో కిటికీలు నిర్మించాలని గాలి వెలుతురు వచ్చే విధంగా ఏర్పాటు చేసి సెక్యూరిటీకి అప్పగించాలన్నారు.

అండర్ బ్రిడ్జి హాస్పిటల్ కు మధ్య ఉన్న స్థలాన్ని వాహనాల పార్కింగ్ కు కేటాయించాలని కలెక్టర్ తెలిపారు.

నీటి ట్యాంక్ క్రింద ఉన్న రూమును మెయింటెన్స్ కి ఇవ్వాలని, అందులో ఎలక్ట్రిషియన్ సిబ్బందికి కేటాయించాలన్నారు. అదనంగా మరో నీటి ట్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోస్టుమార్టం రూమును వినియోగించుకోవాలన్నారు. ఆర్వోఆర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఏప్రిల్ 15వ తేదీలోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జనరల్ హాస్పిటల్ పర్యవేక్షకులు వెంకట రాములు, హాస్పిటల్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఈడబ్ల్యూఐడిసి ఈఈ ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు.