ఆధ్యాత్మిక చింతన మంచి ఆలోచనలు పెంపొందిస్తుంది.. 

ఆధ్యాత్మిక చింతన మంచి ఆలోచనలు పెంపొందిస్తుంది.. 
  • జిల్లా కలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్:ఆధ్యాత్మిక చింతన మంచి ఆలోచనలు  పెంపొందిస్తుందని, మంచి ఆలోచనలు సమాజ హితానికి ఉపయోగపడతాయని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో కలెక్టర్ శశాంక కు స్వాగతం పలికారు. అనంతరం ప్రజలసంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్రసంక్షేమం కోసం శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ... కురవి ఆలయం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, అందరూ సహకరిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కురవి ఆలయానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని సౌకర్యాలు కల్పన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నందనం కవిత ఆలయ సిబ్బంది రవి వార్డు సభ్యులు నూతక్కి నరసింహారావు వేద పండితులు పురోహితులు ఉన్నారు.