ఇట్లా..అయితే..! ఎట్లా..!!

ఇట్లా..అయితే..! ఎట్లా..!!

అధికారుల పనితీరుపై జెడ్పీచైర్ పర్సన్ ఆగ్రహం.. 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విధినిర్వాహణలో మీ..నిర్లక్ష్యం మూలంగా మళ్ళీ మేమే ప్రజలనుండి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఇట్ల అయితే... ఎట్లా అంటూ మహబూబాబాద్ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ బిందు ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. 

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో మంగళవారం ఆమె పర్యటించారు. బయ్యారం మండలంలోని  కోడిపుంజుల తండా గ్రామం నుండి రంగశాయి పేట వరకు రూ.1.85 కోట్లతో మంజూరు ఐన ఆర్అండ్ బి రోడ్డు  నిర్మాణం పనులు నత్తనడకన సాగడం పై గ్రామస్థుల జెడ్పీచైర్ పర్సన్ బిందుకు ఈ..పర్రటనలో పిర్యాదు చేసారు.  సంబధిత ఆర్అండ్ బి శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ తానేశ్వర్ ను  వెంట తీసుకుని క్షేత్రపరిశీలన చేసారు.    ఈ సందర్భంగా కోడిపుంజులు తండా రోడ్డు పనులు మొదలై ఒక సంవత్సరం కావస్తున్నప్పటికి ఇప్పటి వరకు పనులు ఎందుకు పూర్తి చేయలేక పోయారని అధికారులను ప్రశ్నించారు. రోడ్డు పూర్తి చేయలేకపోతే రాబోయే వర్షాకాలంలో గ్రామస్థులు ఆరోడ్డుపై అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు ఉంటాయని, గతంలో రోడ్డు సౌకర్యం లేక ఒక గర్భిణీ స్త్రీ చనిపోయిన ఘటనలు ఉన్నాయని గుర్తుచేసారు. అలాంటి పరిస్థితులు రాకుండా వెంటనే పనులు పూర్తి చేయాలని, ఒక వారంలోపు కనీసం ఒక్క లెవెల్ మేటలింగ్ అయినా పూర్తి చేస్తే రోడ్డు ప్రజలు నడవడానికి వీలవుతుంది అని బిందు తెలిపారు.  ఒక వారంలో మళ్ళీ పరిశీలనకు వస్తామని ఆలోపు మెటలింగ్ పూర్తి చేయాలని, అట్టి పని పురోగతిని తనకు ప్రతి రోజూ నివేదించాలని అధికారులను ఆదేశించారు.  ఒక వారంలో మళ్ళీ గ్రామానికి వస్తానని రోడ్డు పనులతో పాటు గ్రామంలోని సమస్యలపై అధికారుల సమక్షంలో సమీక్షించి పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్ బి ఈఈ  తానేశ్వర్, సర్పంచ్ తాటి వెంకన్న, సింగర బోయిన శ్రీను, చిన్ని, బొడా లక్ష్మణ్, వార్డు సభ్యులు కిషన్, వీరన్న, బానోత్ మాంత్రియ, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.