ముదిరాజ్ ల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి- నీలం దుర్గేష్

ముదిరాజ్ ల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి- నీలం దుర్గేష్

కేసముద్రం, ముద్ర: ముదిరాజ్ ల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ అన్నారు. హైదరాబాదులో సోమవారం నిర్వహించే రాష్ట్ర మత్స్యకార సహకార సొసైటీల సమాఖ్య చైర్మన్ గా నియమితులైన పిట్టల రవీందర్ పదవి స్వీకారోత్సవానికి మహబూబాబాద్ జిల్లా నుంచి నీలం దుర్గేష్ ఆధ్వర్యంలో భారీగా ముదిరాజులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం సహకార సంఘాలను ప్రభుత్వం ఒక సమాఖ్యగా ఏర్పాటు చేసి చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ను నియమించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు ఉచితంగా చేపల పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని, 18 ఏళ్ళు నిండిన మత్స్యకార కుటుంబాలకు చెందిన యువకులకు సహకార సంఘంలో సభ్యత్వం కల్పిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు ఈ సభ్యత్వం ద్వారా వర్తిస్తాయని తెలిపారు. ఫిషరీష్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి పిట్టల రవీందర్ ను చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో రాబోవు రోజుల్లో మత్స్యకారుల సంక్షేమానికి మరింత దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. దుర్గేష్  వెంట ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు చిల్లా సహదేవ్, దుండి వెంకన్న, కార్యదర్శి ఎదురబోయిన సూరయ్య, కేసముద్రం, ఇనుగుర్తి మండలాల అధ్యక్షులు లింగాల పిచ్చయ్య, మల్లం యాకయ్య, గ్రామ మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు హైదరాబాద్ తరలి వెళ్లారు.