పెద్ద చెరువులో అతి పెద్ద చేపలు!

పెద్ద చెరువులో అతి పెద్ద చేపలు!

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కలవల గ్రామ పెద్ద చెరువులో  శనివారం మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లగా వలలకు మూడు అడుగుల పొడవు, 10 కిలోలకు పైగా బరువు ఉన్న చేపలు చిక్కడంతో మత్స్యకారులు తెగ సంబరపడ్డారు. తాను ఇంతకుముందు ఎన్నడూ తమ గ్రామ చెరువులో ఇంత పెద్ద చేపలను చూడలేదని ముదిరాజ్ సంఘం నాయకుడు లింగాల పిచ్చయ్య అన్నారు.

ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువులో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచడంతో పాటు, ఎస్సారెస్పీ కాలువల ద్వారా గోదావరి జలాలను చెరువులోకి విడుదల చేయడం వల్ల రెండేళ్లుగా చెరువులో నీళ్లు ఇంకిపోకపోవడంతో చేపలు భారీ సైజులో పెరిగాయని ఆనందం వ్యక్తం చేశాడు. చెరువులో చేపలు పడుతున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరగా భారీ సైజు చేపలను చూసి అమితాశ్చర్యానికి గురయ్యారు.