బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసిడిఎస్, పోలీసులు

బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసిడిఎస్, పోలీసులు

కోదాడ, ముద్ర:కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న లక్ష్మీపురం కాలనీలో శనివారం జరుగుతున్న బాల్య వివాహాన్ని పోలీసులు,ఐసిడిఎస్ అధికారులు అడ్డుకున్నారు. వివరాలు ఇలావున్నాయి.లక్ష్మీ పురం లో తల్లిదండ్రులు తమ మైనర్ కూతురికి వివాహ ఏర్పాట్లు చేసారు. బాలిక కు చట్ట ప్రకారం గా 18 సంవత్సరాలు నిండలేదని మైనర్ బాలిక కు వివాహం జరుపుతున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కోదాడ పట్టణ సిఐ ఆంజనేయులు ,ఐసిడిఎస్ అధికారుల తో కలిసి వివాహం జరుపుతున్న ఇంటికి వెళ్లి వివాహం జరుపుకుండా అడ్డుకున్నారు.

 అనంతరం వధువు, వరుని తల్లిదండ్రులకు  కౌన్సిలింగ్ ఇచ్చామని కోదాడ పట్టణ సీఐ ఆంజనేయులు  ఐసీడిసి అధికారి సూర్యకళ మీడియా సమావేశంలో వెల్లడించారు.  బాల్య వివాహాలు చేయడం చట్ట ప్రకారం నేర మన్నారు. ఎక్కడైనా ఇలాంటి బాల్య వివాహాలు జరిపితే తమకు సమాచారం ఇవ్వాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.