ఇల్లు కూలి మృతి చెందిన మృతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

ఇల్లు కూలి మృతి చెందిన మృతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
  • 50 లక్షల ఎక్స్ గ్రేషియా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలి
  • మృతి చెందిన శ్రీను పిల్లల బాధ్యత ప్రభుత్వం స్వీకరించాలి
  • టీపీసీసీ అధికార ప్రతినిధి అన్నపర్తి జ్ఞాన సుందర్

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల కేంద్రంలో బుధవారం రాత్రి నిద్రపోతున్న శీలం రాములు (80) శీలం రామక్క (70)శీలం శ్రీనివాసులు ఇల్లు కూలి మృతి చెందిన సంఘటన అత్యంత బాధాకరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నెపర్తి జ్ఞాన సుందర్ అన్నారు .గురువారం సంఘటన విషయం తెలుసుకున్న జ్ఞాన సుందర్ నాగారం గ్రామంలో మృతుల కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చినట్లయితే ఈ ప్రమాదం జరిగేది కాదని ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటనని  అన్నారు .జరిగిన సంఘటన వల్ల ముగ్గురు పిల్లలు అనాధలుగా మారారని వారి బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు .బాధితులకు తక్షణమే 50 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు .ఒకవేళ ప్రభుత్వం స్పందించి ముగ్గురు పిల్లల బాధ్యత తీసుకోకపోతే ఆ ముగ్గురు బాధ్యత తానే తీసుకుంటానని అన్నారు. జరిగిన ఘటనపై మంత్రి తక్షణమే స్పందించాలని కోరారు.