బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు అందుబాటులోకి కాంబినేషన్ డ్రగ్స్

బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు అందుబాటులోకి కాంబినేషన్ డ్రగ్స్

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , అంబేద్కర్ నగర్ ను జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి  పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో బీపీ మరియు షుగర్ ఉన్నవాళ్లు రెండు రకాల మాత్రలు వాడవలసి వచ్చినప్పుడు రెండు మాత్రలు వేరువేరుగా ఉండేవి. కానీ తెలంగాణ ప్రభుత్వంలో కాంబినేషన్ డ్రగ్స్ ( అంటే రెండు మాత్రలు కలిపి ఒక మాత్రగా ) ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల రోగి రెండు మాత్రలు మింగవలసిన అవసరం లేకుండా ఒకే మాటలో రెండు రకాల ఔషధాలు వ్యాధిగ్రస్తునికి అందుబాటులో ఉంటాయి. బయట ఎంతో ఖరీదు కలిగిన ఈ మాత్రలు ఇప్పుడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు ఇట్టి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కోరారు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలని , బీపీ పరీక్షల కోసం ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేకంగా బీపీ మిషన్లు పంపిణీ చేసినట్లు తెలియజేశారు.

బిపి షుగర్ వ్యాధిగ్రస్తులకు కాంబినేషన్ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చినట్లు తెలియజేశారు.నెల రోజులకు సరిపడా మాత్రలు ఒకేసారి ఆరోగ్య కార్యకర్తల వద్ద, పల్లె దవాఖానాలలో , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తీసుకునే వెసులుబాటు కల్పించబడిందని ఇట్టి అవకాశాన్ని బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్లు భూతరాజు సైదులు, సాంబశివరావు రమాదేవి తదితరులు ఉన్నారు.