నిరుపేద విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన ఫలితమే నన్ను ఈ స్థాయికి చేర్చింది

నిరుపేద విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన ఫలితమే నన్ను ఈ స్థాయికి చేర్చింది
  • నేతాజీ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడం ఆనందంగా ఉంది
  • నేతాజీ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాఠశాల వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: ఆనాడు నేతాజీ విద్యా మందిర్ ను స్థాపించి నిరుపేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో ఉత్తమ విద్యా బోధన అందించిన ఫలితమే నేడు తనను ఈ స్థాయికి చేర్చిందని నేతాజీ విద్యా మందిర్ వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నేతాజీ విద్యా మందిర్ పాఠశాలకు చెందిన 1995-96 పదో తరగతి పూర్వ విద్యార్థులు తాళ్లగడ్డలో, 1998-99 పూర్వ విద్యార్థులు త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్ లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నాడు తాము అందించిన ఉత్తమ విద్యా బోధనతో నేతాజీ విద్యా మందిర్ విద్యార్థులు నేడు జీవితంలో గొప్పగా రాణిస్తున్నారని అన్నారు. నాడు ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన తనకు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి జగదీష్ రెడ్డి లు ఉభయసభల్లో మాట్లాడే అవకాశాన్ని కల్పించారని అన్నారు.

నేతాజీ విద్యా మందిర్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వివిధ రంగాల్లో ముందుకు సాగడం గర్వనీయమన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నప్పటికీ పాఠశాలను ఏనాడు నిర్లక్ష్యం చేయలేదని విద్యార్థుల కు ఉత్తమ విద్యా బోధన అందించేందుకు కృషి చేశానని ఆ ఫలితమే నన్ను,  నా విద్యార్థులను మంచి స్థాయిలో ఉంచిందన్నారు. నేడు నేతాజీ విద్యా మందిర్ పూర్వ విద్యార్థులంతా సమ్మేళనాలు నిర్వహించుకుని కలుసుకొని పాఠశాల గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం అభినందనీయమన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థులంతా కలిసికట్టుగా ఉంటూ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండాలని అందుకు తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు.

అనంతరం రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ దంపతులతో పాటు, నాడు విద్యా నేర్పించిన గురువులు వెస్లీ, వాణి, చంద్రకళ,  విజయలక్ష్మి,  భాను,  నాగమణి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 1998-99 పూర్వ విద్యార్థులు సండ్రపాటి రవి,  పతాని రవీందర్, ఊట్కూరి శ్రీనివాస్,  రాపర్తి సతీష్,  అనంతుల కిరణ్, పి.మోహన్,  బైరు నాగేందర్, ఇరుగు కృష్ణ,  అప్పల కిరణ్, సంధ్య,  మాధవి, శ్వేత,  కవిత, లక్ష్మి, 1995-96 పూర్వ విద్యార్థులు రాపర్తి సైదులు,  రాపర్తి మహేష్,  ఎస్.రవి,  కాజా, వి సైదులు,  విష్ణు,  బిక్షం,  శ్రీను,  వసంత,  శ్రీలత,  సుధారాణి తదితరులు పాల్గొన్నారు.