రోడ్లు లేక గిరిజన తండా ప్రజలు ఇబ్బందులు 

రోడ్లు లేక గిరిజన తండా ప్రజలు ఇబ్బందులు 
  • రాపోలు నవీన్ కుమార్

ముద్ర,తెలంగాణ:-మంగళవారం నేరేడుచర్ల మండలం లో ముసోడ్డుతండా, పులగంబండ తండా, రామకృష్ణ తండా, జగన్నాతండాలను సందర్శించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను బహుజన్ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గిరిజన ప్రజలు ఇండ్లు రోడ్లు లేక వర్ష కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం గిరిజనులను ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారు అని, పూటకో హామీ ఇచ్చి అమాయక గిరిజన ప్రజలను మోసం చేస్తున్నారని తండా లో రోడ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తండాలను,గూడాలను, అనుసంధానం చేస్తూ నూతన గ్రామ పంచాయతీలుగా ప్రకటించినప్పటికీ ఒక్క చోట కూడా ఇంత వరకు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించలేదని, పరిపాలన భవనాలు లేకపోవడం వల్ల తండాలు అభివృద్ధి చెందడం లేదని మండిపడ్డారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఉపాధ్యక్షలు జీలకర్ర రామస్వామి, ఉప సర్పంచ్ బానోత్ రవి,వార్డ్ మెంబర్ బానోత్ నాగులు, బానోత్ శంకర్, బిక్షం, శీను, కామల్లీ, సైదమ్మ, నాగు, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.