ఏప్రిల్​లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మంత్రి కేటీఆర్​

ఏప్రిల్​లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మంత్రి కేటీఆర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్ర అసెంబ్లీ, జమిలి ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగకపోవచ్చని, అక్టోబర్​ 10లోగా షెడ్యూల్​ వస్తేనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని, కానీ, నోటిఫికేషన్​ వచ్చేది అనుమానమే అని అభిప్రాయపడ్డారు. మరో ఆరు నెలల తర్వాతే ఎన్నికలు ఉండవచ్చేమోనని, ఏప్రిల్​, మే నెలలో ఎలక్షన్స్​ ఉంటాయని, ఈ ఎన్నికలపై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే, జమిలి ఎన్నికలు ఉన్నా లేకపోయినా భారత రాష్ట్ర సమితికే లాభమన్నారు.