ప్రజా ఉద్యమాలకు సూర్యాపేట పెట్టింది పేరు

ప్రజా ఉద్యమాలకు సూర్యాపేట పెట్టింది పేరు
  • వీర తెలంగాణా, వేరు తెలంగాణాఉద్యమాలకు ఊతం ఇచ్చిన నేల
  • కుటుంబాన్ని కాదనుకుని సమాజానికిఅంకితమైన ధర్మ బిక్షం
  • ఆస్తి పాస్తులను కాదనుకుని సాయుధ పొరులోకి దిగిన బి యన్
  • నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచిన ఉప్పల మలుసురులు ఈ గడ్డ బిడ్డలే
  • తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట నిర్మాణంలో సూర్యాపేట పాత్ర కీలకం
  • తొలి, మలి దశ తెలంగాణా ఉద్యమాలకు ఊపిరి లూదిన నేల
  • వనమావెంకట్రామయ్య,గుండావెంకటప్పయ్య, కేసి గుప్త విగ్రహల ఏర్పాటు 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: ప్రజా ఉద్యమాలకు సూర్యాపేట పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ ఉద్యమం వెనుక వ్యాపార వర్గాలు కీలక పాత్ర వహించారని ఆయన ప్రశంశించారు. నాటి నైజాం పాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీద నుండే పోరాటం ప్రారంభం అయిందన్నారు.ఆ పోరాటం వెనుక ముఖ్య భూమిక పోషించింది వ్యాపార వర్గాలే ఆన్న నగ్న సత్యాన్ని విస్మరించరాదన్నారు.

శుక్రవారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య ప్రముఖులతో ఇష్టా గోష్టిగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.వ్యాపారం తో పాటు సమాజ సేవలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న వర్తక వ్యాపార వర్గాలు నాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం మొదలు,నిన్నటి వేరు తెలంగాణా ఉద్యమాలకు ఊపిరి లుదారని ఆయన గుర్తుచేశారు.నైజం పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది సూర్యాపేట లోనే నని అది కుడా వర్తక వ్యాపార వాణిజ్య వర్గాల ప్రోత్సాహం తోటే అని ఆయన తెలిపారు. ఆ తరువాత జరిగిన 1969 తెలంగాణా తోలి దశ ఉద్యమం మొదలు,1972 లో జరిగిన జై ఆంద్రా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలైంది కుడా చైతన్యానానికి మారు పేరుగా నిలిచిన సూర్యపేట నుండే అని ఆయన అన్నారు.

ఆ తరువాత క్రమంలో 1998 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై తెలంగాణా జనసభ పేరుతో వేరు తెలంగాణా ఉద్యమానికి ఊపిరి లూదిన నేల కుడా సూర్యాపేటే అని ఆయన చెప్పారు. అటువంటి గడ్డ మీద నుండే బహుబందాలను దూరం చేసుకొని బొమ్మగాని ధర్మభిక్షం, ఆస్తి పాస్తులను వదులు కొని భీమిరెడ్డి నరసింహా రెడ్డి,నిజాయితీకి ప్రతిబింబంగా నిలిచిన ఉప్పల మల్సూరు లు సూర్యపేట బిడ్డలు కావడం మనం గర్వ పడే అంశమన్నారు.అటువంటి మహనీయుల స్ఫూర్తి వర్తమానానినికి అందించాల్సిన గురుతర బాధ్యత మనందరి మీద ఉందన్నారు. ఎక్కడ కుడా ఆర్యవైశ్యులు వ్యాపారానికే పరిమితము కాలేదని వారి ప్రొత్సహంతోటే ఉద్యమాలు సాగాయని ఆయన గుర్తుచేశారు. మొన్నటికి మొన్న సూర్యపేట జిల్లా కేంద్రంలో బాలభవన్ ఏర్పడింది అంటే అది ముమ్మాటికి వనమా వెంకట్రామయ్య గొప్పత నమే నని ఆయన కొనియాడారు. అటువంటి వారిని స్మరించుకునేందుకే ఈ నెల 16 న సూర్యపేట జిల్లా కేంద్రంలో సేవాంకిత సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వనమా వెంకట్రామయ్య, గుండా వెంకటప్పయ్య లను స్మరించు కోవడం తో పాటు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన కేసి గుప్తా విగ్రహం రోడ్ల విస్తరణతో పక్కకు పోయినందున అదే రోజు పునరుద్ధరణ ఉంటుందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.యింకా ఈ కార్యక్రమంలో మీలా మహాదేవ్,మోరిశెట్టి శ్రీనివాస్, ఉప్పల ఆనంద్,తోట శ్యామ్, బండారు రాజా, రాచర్ల కమలాకర్,మీలా వంశీ,
 మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లలితా ఆనంద్,గుండా శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.