Congress Janajatara Sabha - మహబూబాబాద్‌లో కాంగ్రెస్ జనజాతర సభ

Congress Janajatara Sabha - మహబూబాబాద్‌లో కాంగ్రెస్ జనజాతర సభ

ముద్ర,తెలంగాణ:- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్న జన జాతర సభకు సర్వం సిద్ధం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే టార్గెట్‌గా కాంగ్రెస్ వ్యూహాలు చేస్తోంది. కాగా ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన మహబూబాబాద్ లోక్‌సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా నామినేషన్ దాఖలు తర్వాత జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు వస్తోన్న రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారు.