ముగిసిన వేసవి శిక్షణ తరగతులు

ముగిసిన వేసవి శిక్షణ తరగతులు

గూడూరు మే 31 (ముద్ర): వేసవికాలంలో విద్యార్థులు తమ ప్రతిభను పెంచుకునేందుకు గూడూరు మండలంలో ఏర్పాటుచేసిన వేసవి శిక్షణ తరగతులు నేటితో ముగిసాయి.  కాగా మండలంలోని  వివిధ పాఠశాలలో చదువుకుంటూ గూడూరు ఆవాస ప్రాంతాల పరిధిలో  నివాసం ఉంటూ ఈ విద్యా సంవత్సరం లో 8వ, 9వ,10వ చదువుతున్న విద్యార్ధిని విద్యార్ధులకు సహ పాఠ్య అంశాలైన క్రీడలు, డ్రాయింగ్, కళలను వెలికి తీసి వారి ప్రతిభను పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ది.06.05.2023  నుండి ది.31.05.2023 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు గూడూరు నందు వేసవి శిక్షణా కార్యక్రమము జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి సూచన మేరకు నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణా తరగతులలో విద్యా సంబంధిత అంశాలైన గణితం, ఆంగ్లం, భౌతిక శాస్రాలకు సంబంధించిన మౌలిక భావనలు  విషయ నిపుణల చేత విద్యార్థులకు సులభమైన పద్దతిలో బోధించనైనది.

ఈ కార్య క్రమానికి శ్రీ.ఇ. చందా ఇంచార్జి మండల నోడల్ అధికారి  సమన్వయ కర్తగా ఉంటూ మండలం లోని అందరూ ప్రధానోపాధ్యాయులు, మరియు  సంబందిత విషయ నిపుణులైన ఉపాధ్యాయులు సహకారంతో విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం చందా శిక్షణా తరగతులు ముగింపు సందర్భంగా మాట్లాడుతూ   ఈ శిక్షణా తరగతుల లో నేర్చుకున్న అంశాలు , నైపుణ్యాలను విద్యార్థులు రాబోయే విద్యా సంవత్సరం లో వినియోగించుకొని ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరుతున్నాము.

ఈ  వేసవి శిక్షణా శిబిరం కార్యక్రమములో  ప్రధానోపాధ్యాయులు   చందా, శ్ భిక్షపతి, కాంతారావు, శ్రీమతి  ఏ. స్వరూప ,యం. డి.సోహన్ బి గార్లు  శ్రీ. జి.పూలసింగ్, మరియు దాదాపు 15 మంది విషయ నిపుణులు   క్రీడాంశాలలో  టి.నిర్మల  , భారతి ,  సారమ్మ  ,శ్రీ వెంకటేశ్వర్లు  కూడా తమ సహకారాన్ని అందించారు. ఈ రోజు జరిగిన ముగింపు సమావేశంలో చందా,   రాజేందర్  మరియు  భారతి పాల్గొన్నారు.