ట్రాన్స్ఫారం తగిలి ఎద్దు మృతి

ట్రాన్స్ఫారం తగిలి ఎద్దు మృతి
  • పాడి ఎద్దు రైతుకు నష్టపరిహారం చెల్లించాలి
  • బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి భానోత్ భాస్కర్ నాయక్ 

గూడూరు మే 31 (ముద్ర): ట్రాన్స్ఫారం తగిలి పాడి ఎద్దు మృతిచెందిన  సంఘటనలో ఆ ఎద్దు యజమానునికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, ట్రాన్స్ఫారం హైట్ తక్కువగా ఉండటం వలనే ఇలా జరిగిందని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి భాను భాస్కర్ నాయక్ డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే తేజావత్ రాంసింగ్ తండ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న భూక్య యాకూబ్ అనే రైతు పాడి ఏద్దు  బుధవారం రాంసింగ్ తండ పక్కనే ఉన్న ట్రాన్స్ఫారంకు ఏద్దు మేత కోసం వచ్చి ట్రాన్స్ఫారంనికి తగిలి మృతి చెందడం జరిగింది.

బాగా ఈ విషయం తెలుసుకున్న బీజేవైఎం అధికార ప్రతినిధి భాను భాస్కర్ నాయక్ మాట్లాడుతూ ఈ ట్రాన్స్ఫారం తక్కువ హైట్ లో ఉండడంతో ఏద్దు తగిలి మరణించింది గతంలో హైటు లేపాలని అధికారులకు ఎంత చెప్పినా పట్టించకపోవడం వల్లనే ఇలా జరిగింది ఇకనైనా అధికారులు స్పందించి భూక్య యాకుబ్ అనే రైతుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇంతకుముందు కూడా ఇలానే లాక్య తండ రైతు భూక్య పాపులు ఏద్దు ట్రాన్స్ఫారంకి తగిలి   చనిపోవడం జరిగింది. ఇలాంటి ట్రాన్స్ఫారాలు కిందికి ఉన్న వాటిని హైటు లేపి చర్యలు తీసుకోవాలని కోరారు.