‘పొద'రిల్లు!

‘పొద'రిల్లు!

కేసముద్రం, ముద్ర: ఎండకు చల్లదనాన్నిస్తూ, ప్రకృతి సోయగాన్ని తలపిస్తూ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలోని అడప రమేష్ ‘పొద’రిల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రమేష్ తీగజాతి మొక్కను తెచ్చి ఇంటికి ఇరువైపులా నాటగా అది అల్లుకొని ఇంటిముందు వరండాకు పూర్తిగా విస్తరించి ఆకుపచ్చ వర్ణంతో కనువిందు చేస్తుంది. వేసవికాలంలో గాలితోపాటు చల్లని నీడనివ్వడంతో రమేష్ కుటుంబం ‘కూల్ ' గా కాలం వెళ్లదీస్తున్నారు.