విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి నోట్ పుస్తకాలు ఇచ్చిన గురుకుల విద్యార్థిని ....

విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి నోట్ పుస్తకాలు ఇచ్చిన గురుకుల విద్యార్థిని ....

 విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ నోట్ పుస్తకాలు అందిస్తున్న గురుకుల విద్యార్థిని ప్రసన్నవాణి

మొయినాబాద్, ముద్ర: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి జన్మదినం పురష్కరించుకుని ఓ విద్యార్థిని తన సేవాభావాన్ని చాటుకుంది. పుష్ప గుచ్చంకు బదులుగా నోట్ పుస్తకాలు జన్మదినం సందర్భంగా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామానికి చెందిన బేగరి ప్రసన్నవాణి మండల పరిధిలోని తోలుకట్టా గ్రామంలో ఉన్న చేవెల్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ప్రసన్న వాణి మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్లోని క్యాంప్ ఆఫీస్లో శుక్రవారం మంత్రి సబితారెడ్డిని కలిసి జన్మదినం శుభాకాంక్షలు తెలిపింది.

హస్టల్లో ఇచ్చిన కాస్మెటిక్ చార్జీలతో పోగు చేసుకున్న డబ్బులతో 20 నోట్ పుస్తకాలు కొనుగోలు చేసి జన్మదినం సందర్భంగా మంత్రికి పుష్ప గుచ్చంకు బదులుగా నోట్ పుస్తకాలు ఇచ్చి చిన్నారు పెద్ద హృదయాన్ని చాటుకుంది. కాస్మెటిక్ ఛార్జిలతో నోట పుస్తకాలు కొనుగోలు చేసి ఇవ్వడంతో మంత్రి చిన్నారిని గట్టిగా అత్తుకున్ని అభినందించారు. మంచిగా చదుఉకుని ఉన్నత శిఖరాలను అదిరోహించాలని ఆశీర్వదించారు. చిన్నారితో పాటు టీయూడబ్ల్యుడే జిల్లా GV అధ్యక్షుడు కోంపల్లి శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త నర్సింహ్మరెడ్డిలు ఉన్నారు.