టెండర్ పాడి నాలుగు నెలలైనా తెరుచుకొని  క్యాంటీన్

టెండర్ పాడి నాలుగు నెలలైనా తెరుచుకొని  క్యాంటీన్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రం లోని రెండో క్యాంప్ ఆఫీస్ గా పేరుగాంచిన ప్రభుత్వ హాస్పిటల్లో టెండర్ పాడి నాలుగు నెలలు గడిచిన ఇప్పటివరకు  క్యాంటీన్ తెరుచు కోవడానికి నోచుకోలేదని రోగులు అంటున్నారు. క్యాంటీన్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న వేసవికాలంలో దాహం తీర్చుకునే దిక్కు కూడా లేకుండా పోయిందని, చాయ్ తాగాలన్న ,బ్రెడ్ తినాలన్నా వేడి నీళ్లు కావాలన్నా ఎంతో దూరం వెళ్లాల్సి వస్తుందని, నిత్యం వందల మంది వచ్చే ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం క్యాంటీన్ లేకపోవడం విడ్డూరం అని అందరూ అనుకుంటున్నారు. ఇంతకుముందు క్యాంటీన్  నిర్వహించిన వ్యక్తి సిగరెట్లు గోవాలు, ఇతరత్రా మత్తు పదార్థాలు అమ్మినందుకు అతన్ని క్యాంటీన్ ఖాళీ చేయించి టెండర్ ప్రకారం క్యాంటీన్ టెండర్ వేశారు.

సానిటేషన్ సంబంధించిన వ్యక్తిగతంగా రావడంతో పనులు వేగంగా చేయాల్సి ఉన్న అతని నిర్లక్ష్యంతో  అతను క్యాంటీన్ ఓపెన్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్న రోగులు. శానిటేషన్ కి సంబంధించిన టెండర్దారుడు క్యాంటీన్ విషయంలో అశుద్ధతగా వహిస్తున్నందుకు అతనికి టెండర్ను తొలగించి రిటైన్డర్ ప్రకారం టెండర్ వెయ్యాలని అక్కడ ఉన్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. టెండర్ ద్వారా క్యాంటీన్ దక్కించుకున్న వ్యక్తి క్యాంటీన్ సంబంధించిన షెడ్డు నిర్మాణం అవుతున్న మేస్త్రీలను వేరే వ్యక్తులతో బెదిరించడం జరుగుతుంది.. ఇలా అనుకోకుండా జరుగుతుందా ఇతరత్రా కారణాలు ఏమైనా. కానీ క్యాంటీన్ షెడ్డు నిర్మిస్తున్న మేస్త్రిలు ఇప్పటికీ ముగ్గురు చేంజ్ అవ్వడం వల్ల పని జరుగుతుందా లేదా అసలు క్యాంటీన్ నిర్వహిస్తారో లేదో కూడా తెలియడం లేదు అని రోగులు అనుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని రీటెండర్  వేసి త్వరగా క్యాంటీన్ నిర్వహించేలా చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు... ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ  ఇతర సమస్యలకై ఎమర్జెన్సీ కొరకై వస్తున్న ప్రజలకు  క్యాంటీన్ లేకపోవడం చాలా ఇబ్బందికరమంటున్నారు.