మహనీయుల జయంతుల సందర్బంగా శోభాయాత్ర...

మహనీయుల జయంతుల సందర్బంగా శోభాయాత్ర...

నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి:దేశంలోనీ మెజారిటీ ప్రజలకు అక్షరాన్ని, ఆస్తిని, ఆయుధాన్ని హక్కుగా ఇచ్చిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్ ల జయంతుల సందర్బంగా నాగర్ కర్నూల్ పుర వీధుల గుండా శోభయాత్రను నిర్వహించడం జరిగింది. దేశ ప్రజలంతా కొనియడాదగినా మహనీయులు పూలే, అంబేద్కర్ లనీ అన్నారు. పూలే, అంబేద్కర్ లను ఒక వర్గానికో, ఒక కులానికో పరిమితం చేయడం తగదని హెచ్చరించారు. మహనీయుల ఆశయాలను రాజ్యాధికారం వైపు మళ్లీంచడమే బహుజన యువత లక్ష్యం కావాలని పిలుపు నిచ్చారు.

బహుజనులకు 125అడుగుల విగ్రహాలు, స్మృతి వనాలు, పార్క్ లు అవసరమే కానీ - రాజ్యాధికారం అత్యవసరం అనీ తెలిపారు. రానున్న ఎన్నికల్లో బహుజనులు రాజ్యాధికారం సాదించుకోకపోతే, బహుజనులు జీవితాలు అదోగతి పాలు అవుతాయని అన్నారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్, జిల్లా కార్యదర్శి బోనాసి రాంచందర్, అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీ రాజ్, ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, ఉపాధ్యక్షులు పరుశరామ్, కోశాధికారి ఆనంద్, మండలాల అధ్యక్షులు కళ్యాణ్, శివ శంకర్, లక్ష్మణ్, రాంచందర్ నాయకులు మోహన్ రెడ్డి, నాగేష్, శివ కృష్ణ, బాలరాజు, బాల నాగులు, రాజేష్, మహేష్, శేషు, రాము, వెంకటేష్, శేఖర్, నాగార్జున, అనీల్, చంద్రబాబు, రాజు, రాముడు, మధు, పర్వాతలు, మొగులాల్ లు పాల్గొన్నారు.