సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి -జిల్లా కలెక్టర్ పి.ఉదయ కుమార్

సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి -జిల్లా కలెక్టర్ పి.ఉదయ కుమార్
  • ఆరోగ్య సమస్యలతో బాధపడే భక్తులు సలేశ్వర దర్శనానికి వెళ్ళకండి
  • భక్తులు ఆరోగ్య సమస్యలను పరీక్షించుకొని సలేశ్వర దర్శనానికి నడక ప్రారంభించండి 
  • త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అధిక సంఖ్యలో త్రాగునీటిని ఏర్పాటు చేయాలి
  • నడక దారి వెంట సోలార్ విద్యుకరణను ఏర్పాటు చేయాలి

 నాగర్ కర్నూల్ జిల్లా  ముద్ర ప్రతినిధి: ఈ నెల 5వ తేదీ నుండి 7వ తెదీవరకు జరిగే సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ మోతిలాల్ అదనపు ఎస్పీ రామేశ్వర్, డి. ఎఫ్. ఓ రోహిత్ గోపిడి, ఇతర జిల్లా అధికారులు, సలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులతో జాతర ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు లేకుండా రాత్రిపూట నడిచే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు.  ఈ సారి జాతరకు ఏప్రిల్ 5 నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. 
ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఫారహాబాద్ నుండి లోపలికి అనుమతించడం జరుగుతుందని ఆ తర్వాత ఎట్టి పరిస్థిలో అడవి లోపలికి అనుమతించరని తెలియజేసారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. అడవిలోకి ప్లాస్టిక్ వస్తువులు అనుమతించరన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రమాద వశాత్తు అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అటవీ శాఖ సిబ్బందితో కలిసి పోలీస్ శాఖ వారు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

రాత్రి వేళల్లో నడిచే భక్తులకు ఏలాంటి సౌకర్యం లేకుండా మధ్య మధ్యలో సోలార్ లైట్లును ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు నాగర్ కర్నూల్ కల్వకుర్తి మరియు అచ్చంపేట డిపోల నుండి కండిషన్ లో ఉన్న బస్సులను మాత్రమే ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య శాఖ తరపున 3 చోట్ల ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందీని, అంబులెన్స్ లను ఏర్పాటు చేయాలన్నారు. కింద గుండం దగ్గర వైద్య సిబ్బంది ఒక వైద్యుడు అన్ని రకాల సదుపాయాలతో సంసిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడైనా అనుకోకుండా ఘటనలు జరుగుతే అప్పటికప్పుడే తరలించేందుకు ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్ డి ఆర్ ఎస్ తరహాలో ఫైర్ సిబ్బంది ఉండాలన్నారు. తాగునీటికి ఆర్. డబ్ల్యూ ఎస్. శాఖ తరపున ఏర్పాటు చేయాలని తెలియజేసారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున త్రాగునీటి సరఫరాకు కొదవ లేకుండా 30 వాహనాల ట్రాక్టర్లతో పాటు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్య శిబిరాల వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న భక్తులకు వైద్య పరీక్షలు చేసి నాలుగు గంటల పాటు నడిచే శక్తి వారి పొందలేదు తెలియజేసి నడవలేని పరిస్థితిలో ఉంటే వారికి స్పష్టంగా తెలియజేయాలని వైద్య ఆరోగ్యశాఖను కలెక్టర్ ఆదేశించారు.

భక్తులు కూడా ఆరోగ్య సమస్యలతో ఎవరు కూడా సలేశ్వర దర్శనానికి వెళ్లొద్దని కలెక్టర్ కోరారు. ముఖ్యంగా భక్తులకు ఏలాంటి అసౌకర్యం లేకుండా సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఏ శాఖ అధికారులకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పారో వాటితో పాటు వారి పూర్తి సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని ఆర్డిఓ నాదేశించారు. ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్ మోతిలాల్, అదనపు ఎస్పి రామేశ్వర్, డి. ఎఫ్. ఓ రోహిత్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, ఆర్. డి. ఓ పాండు నాయక్, జిల్లా ఇమినేషన్ అధికారి రవి నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీధర్ రావు, డిఎస్పీ కృష్ణ కిషోర్, ఆర్టీసీ డిఎం ధర్మ సింగ్, అచ్చంపేట ఆర్టీసీ డిఎం రాజశేఖర్, అచ్చంపేట తాసిల్దార్ కృష్ణ, ఫైర్ అధికారి ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు..