ప్రజల జీవితాల్లో మార్పే పార్టీ బాధ్యత

ప్రజల జీవితాల్లో మార్పే పార్టీ బాధ్యత

నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి: 14 ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చి, 9 ఏళ్లుగా తెలంగాణను ముఖ్యమంత్రిగా కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు 

అంబలికేంద్రాలు నడిచిన చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాం

గంజి కేంద్రాల కోసం, అంబలికేంద్రాల కోసం, 2 రూపాయల బియ్యం కోసం చూసిన తెలంగాణ దేశానికి బువ్వపెట్టే స్థాయికి ఎదిగింది 

బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలలో భాగస్వాములే .. అది గుర్తెరిగి మనం ప్రవర్తించాలి .. మనం తొమ్మిదేళ్లలో సాధించిన దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకుసాగాలి

60 వేల మంది గులాబీ కార్యకర్తల బలగం మనది

నియోజకవర్గంలో 44 వేల మంది ఆసరా ఫించను లబ్దిదారులు మనకు ఆసరా

80 వేల మంది రైతుబంధు లబ్దిదారులు మనకు బలం

వీరంతా మన శ్రేయోభిలాషులు .. వారిని పలకరించి వారి ఆశీస్సులు అందుకుంటే చాలు .. మనకు ఢోకా లేదు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తున్నాం

కంపతారు చెట్లు కొట్టి అమ్ముకోని కడుపు నింపుకునే కాలమొచ్చినాది అన్న గోరటి వెంకన్న పాటలు ప్రజలను చైతన్యం చేశాయి

అబ్దుల్ ఖాదర్ సర్వీసులే ఆ జిల్లాలో గ్రామాలకు బాటలు వేశాయి .. జిల్లాకు ఆయన చేసిన సేవలు మరవలేనివి

తెలంగాణలో కందనూలు జిల్లా అయింది .. మెడికల్ , నర్సింగ్ కళాశాల ఏర్పాటయ్యాయి .. భవిష్యత్ లో కేసీఆర్ ఆశీస్సులతో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కావడం ఖాయం

ఒక్క ఎకరాకు కృష్ణమ్మ నీళ్లు రాని ప్రాంతంలో ఎన్నో మార్పులకు తెలంగాణ శ్రీకారం చుట్టింది

తెలంగాణ ప్రభుత్వం శరవేగంతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశాం

కల్వకుర్తి ఎత్తిపోతలకు 40 టీఎంసీలు నీటిని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం

1984 నుండి 2014 వరకు తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల పనులను సాగదీశారు

గత పాలకులకు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి, రైతులకు సాగునీళ్లు అందించే మనసులేక దశాబ్దాలు సాగదీశారు

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, హరీష్ రావు సాగునీటి శాఖా మంత్రిగా, నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ప్రాజెక్టు పనులను పరిశీలించి సాగునీళ్లు పారించాం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలు

ఆ ప్రాజెక్టు మొదలు పెట్టగానే అటు ఆంధ్రా ప్రభుత్వం, ఇటు తెలంగాణ ఇంటి దొంగలు 190 రకాల కేసులు వేశారు

ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు మేలు జరిగితే తమకు రాజకీయంగా పుట్టగతులుండవని అడ్డుకునే ప్రయత్నం చేశారు

అన్ని అడ్డంకులు తట్టుకుని ప్రాజెక్టు పూర్తవుతుంది .. త్వరలోనే సాగునీళ్లు అందిస్తాం

ప్రాజెక్ట్ మొదలుపెట్టి కేవలం మూడేళ్లలో కాళేశ్వరం ఎత్తిపోతల పూర్తి చేసిన ఏకైక మొనగాడు ముఖ్యమంత్రి కేసీఆర్ 

భాషా, సంస్కారం లేని వాళ్లు ప్రతి రోజూ కేసీఆర్ ను విమర్శించడం సిగ్గుచేటు

పార్టీలో పదవులు అనుభవించి పోయిన వారు కూడా కేసీఆర్ ను విమర్శించడం సిగ్గు చేటు

ప్రజలే ఎజెండా .. ప్రజల బాగే కోరుకునే వారు నిజమైన నాయకులు

9 ఏళ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెందింది 

ప్రతి 2,3 గ్రామాలకు ఒక ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం

తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం లేనోళ్లు కేసీఆర్ ను విమర్శిస్తున్నారు

కేసీఆర్ మాదిరిగా దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఆసరా ఫించన్లు, కరంటు, రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి ఇస్తున్నారా ? రైతుల పంటలు కొనుగోలు చేస్తున్నారా ?

పేదల డబ్బు దోచి పెద్దలకు, కార్పోరేట్లకు పెడుతున్న వారు కేంద్రాన్ని ఏలుతున్నారు

ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ డబ్బులను ఆదానీకి పెట్టుబడులు పెట్టించారు .. అది నష్టపోతే 40 కోట్ల మంది పాలసీదారులు మునిగిపోతారు

అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారు

12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేసి కార్పోరేట్లకు ప్రజాధనం దోచిపెట్టారు.