కాంగ్రెస్ గూటిలోకి జిల్లా నేతలు మాజీ మంత్రి జూపల్లి ఇంటికి పిసిసి చీప్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ గూటిలోకి జిల్లా నేతలు మాజీ మంత్రి జూపల్లి ఇంటికి పిసిసి చీప్ రేవంత్ రెడ్డి

 ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ జిల్లా :  పార్టీలో చేరనున్న కూచుకుళ్లా తనయుడు రాజేష్ నాగర్ కర్నూల్ గత కొద్ది రోజులుగా రాజకీయ ఊగిసలాటలో  ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిలు అధికార పార్టీకి తెగతెంపులు చేసుకొని హస్తం గుర్తుకు చేరేందుకు సిద్ధమయ్యారు బుధవారం మాజీ మంత్రి జూపల్లి నివాస గృహానికి పిసిసి రేవంత్ రెడ్డి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించగా పార్టీలో చేరేందుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తమ్ముడు రాజేష్ రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో పలువురు కారు నేతలు హస్తం గుడ్డులోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వీరి చేరిక జిల్లా రాజకీయాన్ని రసకందంగా మార్చాయి వీరితో పాటు పలువురు నేతలు హస్తినలో హస్తం గుర్తుకు చేరుతారని గుసగుసలు వినిపించినప్పటికీ జూపల్లి రాజేష్ రెడ్డి లు మాత్రమే ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా జూపల్లి వెంట పార్టీ కండువా మార్చుతారని చర్చ సాగినప్పటికీ కుమారుడు మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఇరువురు నేతల తో పాటు వనపర్తి జిల్లాకు చెందిన కొందరు హస్తం గూటికి చేరిన తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు అది ఈ నెల చివరిలో నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారని త్వరలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది దీంతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి లో ఆందోళన మొదలైంది ఇటీవల ఐటీ దాడులు ముగిసిన అనంతరం నియోజకవర్గానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి సన్మానం చేసిన సందర్భంలో చేసిన అనేక వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడం నియోజకవర్గ కేంద్రంలో చర్చగా మారింది. కాంగ్రెస్ లోని నాగం జనార్దన్ రెడ్డి మరియు దామోదర్ రెడ్డిలు ఏకమవుతున్నారని సంగతి తెలియడంతో బిఆర్ఎస్ పార్టీలో ఓటమి భయం పట్టుకుంది. దానికి పరాకాష్టగానే ఆయన ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ నేతలు హస్తం గుడికి చేరడంపై నియోజకవర్గంలో జిల్లాలో విస్తృతంగా చర్చ సాగుతుంది.