జయశంకర్ సార్ కల నిజం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

జయశంకర్ సార్ కల నిజం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

మెట్‌పల్లి ముద్ర:- నీళ్ళు, నిధులు నియామకాలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కల అని ఆయన కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నాడని.ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సార్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ తుది శ్వాస విడిచే వరకు తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించాడని. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటం మరవలేనిది అన్నారు.మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.