కొండగట్టులో భక్తుల రద్దీ

కొండగట్టులో భక్తుల రద్దీ

ముద్ర, మల్యాల:కొండగట్టు అంజన్న ఆలయంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి అంజన్నకు మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకలు నిర్వహించారు. కాగా, వాహనాలను ఎక్కువ సంఖ్యలో కొండపైకి వదలడంతో  ఆలయం వెనుకాల భక్తులకు అసౌకర్యంగా మారింది. కొందరు అర్చకులు నిబంధనలకు విరుద్ధంగా ఆలయం వెనుకాల వాహనాల పూజలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.