జగిత్యాలలో బిజెపి నాయకుల అరెస్టు

జగిత్యాలలో బిజెపి నాయకుల అరెస్టు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అరెస్ట్ కు నిరసనగా బిజెపి నాయకులు ఆందోళన చేపడతారని ఉద్దేశంతో రాత్రి జగిత్యాల పట్టణంతో పాటు మండలంలోని పలువురు బిజెపి నాయకులు అదుపులోకి తీసుకొని పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ లకు  తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని బి అర్ యస్  ప్రభుత్వం  ముందస్తు అరెస్ట్ లను ఖండించారు.  బిజెపి జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ చిలకమర్రి మదన్ మోహన్, పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్, కౌన్సిలర్ గుర్రం రాము, ఆముదరాజు, నక్క జీవన్, నలువాల అశోక్ , గట్టుపల్లి జ్ఞానేశ్వర్  జగిత్యాల రూరల్ బిజెపి మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి,  బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగు ఉమేష్,  bc మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గజేందర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పూదరి శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కర్నే నర్సింహారెడ్డి, దళిత మోర్చా అధ్యక్షుడు తరాల మహేష్, మాజీ దళిత మోర్చా జిల్లా కార్యదర్శి దుబ్బాక రమేష్, నరేష్ లను పోలీస్ లు అరెస్టు చేశారు. బిజెపి నాయకులను అరెస్ట్ చేయడానికి జగిత్యాల రూరల్ ఇంచార్జ్ డా.  శైలేందర్ రెడ్డి ఖండించారు.