పవిత్రమైన శాసనసభలను నీచమైన రాజకీయ వేదికలకు వాడుకుంటున్నారు...

పవిత్రమైన శాసనసభలను నీచమైన రాజకీయ వేదికలకు వాడుకుంటున్నారు...

అణగారిన వర్గాలకు అవమానం ఒక అరిష్టం ..
శ్రావణి క్రియాశీల రాజకీయాల్లో ఉండాలి...
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్
రాజీనామా చేసిన శ్రావణిని పార్టీలోకి ఈటెల 

ముద్ర ప్రతినిధి,  జగిత్యాల: పవిత్రమైన శాసనసభలను వారి నీచమైన రాజకీయాలకు వేదికలుగా వాడుకుంటున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.  జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన శ్రావణిని ఈటెల  రాజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గడ్డిపోచలుగా తీసివేస్తున్నారని అనడానికి సజీవ సాక్ష్యం మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన శ్రావణి అని అన్నారు.  చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన శ్రావణి క్రియాశీలకంగా ఉండాలని కోరుకుంటున్నామని, బిజెపితో కలిసి పనిచేయాలని కోరుతున్నామని అన్నారు. మా ఆహ్వ్హనం పట్ల శ్రావణి పాజిటివ్ గా స్పందిస్తారని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. శ్రావణి పడిన బాధ, వేదన ఊరికే పోదుని తనకి  తోడుగా అండగా ఉంటూ రాబోయే కాలంలో శ్రావణి ఏ భావం వ్యక్తం చేసిందో దాన్ని అమలు చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని ఈటల పేర్కొన్నారు. రాష్ట్రంలో అణగారిన దళిత వర్గాలకు ఎక్కువ అవమానం జరుగుతున్నాయని దీనికి ఉదాహరణ కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కంటతడి పెట్టడమే అన్నారు.  

ఓ దళిత మహిళ కంటతడి పెట్టడం రాష్ట్రానికి అరిష్టమని ఇది మంచిది కాదన్నారు. సీఎం ఎమ్మెల్యేలను కేంద్ర బిందువుగా చేసి పరిపాలన సాగిస్తున్నారు కానీ మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని కలెక్టరేట్లు, ఎమ్మార్వో, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలు పనిచేయడం లేదని ఒక పోలీసులు మాత్రమే పని చేస్తున్నారని అది కూడా ఎమ్మెల్యేలు చెప్పిన వారిని దండించడం కోసమే అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు భయపడుతున్నారని ప్రజాస్వామ్యంలో ఇది ఒక గొడ్డలి  పెట్టు అన్నారు. మేధావులు, ఉద్యోగులు, సంఘసంస్కర్తలు ఆలోచించాలని కెసిఆర్ పాలన రాచరిక వ్యవస్థను మించిపోయింది అన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి పరస్పరం గౌరవంతో కలిసిమెలిసి పని చేసే పద్ధతి ఉండేదని కేసీఆర్ ఏలుబడిలో ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే అధికార పార్టీకి చెందిన వారేనని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు, ఎంపీలకు గౌరవం లేదన్నారు. గతంలో శాసనసభలో కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలు చర్చించే గొప్ప వేదికలుగా ఉండేవని నేడు అలంటి పరిస్థితి లేదన్నారు. ఆయన వెంట బిజేపి జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణరావు, పన్నాల తిరుపతి రెడ్డి, మదనమోహన్, రవీందర్ రెడ్డి, బోగ శ్రీనివాస్, వీరబత్తిని అనిల్ తదితరులు ఉన్నారు.