ఈ నెల 30లోగ సిఎంఆర్ చెల్లించాలి: అదనపు కలెక్టర్ బిఎస్ లత

ఈ నెల 30లోగ సిఎంఆర్ చెల్లించాలి: అదనపు కలెక్టర్ బిఎస్ లత

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రభుత్వానికి చెల్లించాల్సిన  సిఎంఆర్ బియ్యం ఈ నెల 30 లోగ  మిల్లర్లు చెల్లించాలని జిల్లా అదనపు కలెక్టర్  బిఎస్ లత పౌరసరఫరా అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని రా, బాయిల్డ్ మిల్లర్లతో యాసంగి 2021-22, వానాకాలం 2022-23లకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి సిఎంఆర్ గడువు ఏప్రిల్ 30 చివరి తేది ఉన్నందున సిఎంఆర్ త్వరగా చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు యాసంగి 2021-22 గాను 74 శాతం మాత్రమే చెల్లించారని, మిగిలిన 26 శాతం  46924.618 ఎంటిఎస్ సిఎంఆర్ బియ్యం ఎఫ్ సి ఐ , సిఎస్ కు చెల్లించాల్సి ఉందన్నారు.

అలాగే  వానాకాలం 2022-23లో రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లు సిఎంఆర్ చెల్లింపులో జాప్యం చేయకుండా త్వరిగతిన చెల్లించాలని ఆదేశించారు. పౌరసరఫరా క్షేత్రస్థాయి డిప్యూటి తహసిల్దార్లు, ఇన్స్పెక్టర్లు యాసంగి సిఎంఆర్ ఏప్రిల్ 30లోగ ప్రభుత్వానికి చెల్లించే విధంగా మిల్లుల ఫై ప్రత్యేక ద్రుష్టి సారించి మిల్లుల వద్ద ఎలాంటి జాప్యం లేకుండా ఎగుమతి చేసేలా, గోదాముల వద్ద ఎలాంటి జాప్యం లేకుండా దిగుమతి చేసేవిధంగా చర్యలు చేపట్టాలని ఏమైనా సమస్య ఏర్పడితే వెంటనే తనకు తగు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.