బెల్ట్ షాపులతో ఉపాధి మాయం... ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

బెల్ట్ షాపులతో ఉపాధి మాయం... ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

ముద్ర రాయికల్ : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో రెండు రోజుల క్రితం వందలాది ఈత తాటి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కిష్టంపేట లోని దగ్ధమైన ఈత, తాటి వానాన్ని పరిశీలించి గీతా కార్మికులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఇప్పటికే బెల్టు షాపులతో కల్లు అమ్మక ఉపాధి కోల్పోతుంటే ఇలాంటి ప్రమాదాలు జరగడం బాధాకరమన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయం అందేలా చేస్తానని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. నష్టపోయిన గౌడ సోదరులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.