'సూర్య' ఫెస్టిన్ బీట్స్ అదుర్స్

'సూర్య' ఫెస్టిన్ బీట్స్ అదుర్స్

అబ్బురపరిచిన సాంస్కృతిక ప్రదర్శన

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పట్టణంలోని స్థానిక సుమంగళి గార్డెన్ లో సూర్య గ్లోబల్ స్కూల్ హై స్కూల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు అంబరాన్నాంటాయి. ఈ వేడుకల్లో  చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్య, నాటిక, సాంస్కృతిక, కళా ప్రదర్శనలు అహుతులను అలరించాయి. ఈ సందర్బంగా పాఠశాల కరస్పాండేట్ శ్రీధర్ రావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటుగా, విభిన్న రంగాల్లో సూర్య గ్లోబల్ రాణించాలని, మరింత ఉన్నత సాధించి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత వెలికి తీస్తూ, నిరంతరం విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఏకైక విద్యా సంస్థ సూర్య గ్లోబల్ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రశాంత్ రావు , హరి చరణ్ రావు, రజిత రావు, మౌనిక రావు,  సుమన్ రావ్, అజిత రావు,  హరి చరణ్ రావు తో పాటు ఉపాధ్యాయ బృందం, తల్లితండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.