17 గంటలు ఎన్నికల పత్రాల పరిశీలన

17 గంటలు ఎన్నికల పత్రాల పరిశీలన
  • స్ట్రాంగ్ రూంలో దొరకని సిసి, విడియో పుటేజ్ 
  • 17 సి, 17 ఎ పత్రాల సమాచారాన్ని సీల్డ్ కవర్లో హైకోర్ట్ కు అందజేసిన కలెక్టర్ 
  • స్ట్రాంగ్ రూము అవకతవకలఫై కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన లక్ష్మన్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురి ఎన్నికలకు సంబంధించి 17 ఫార్ములా పరిశీలన 17 గంటల పాటు సాగింది. ఆదివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం నూకపల్లి వి ఆర్ కె కళాశాలలో ఏర్పాటుచేసిన ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ తాళాలను పగలగొట్టి తెల్లవారుజాము వరకు జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాష, కేంద్ర ఎన్నికల పరిశీలకులు ప్రిన్స్ పల్ సెక్రెటరీ అవినాష్ కుమార్ లు  17 ఏ 17 సి పత్రాల పరిశీలన చేశారు. ఇవీయంలు బద్రపరచిన గదులు తెరిచాక అధికారులు  అందులో ఉన్న 20 ట్రంక్ పెట్టెలో 16 పెట్టలకు అసలు తాళాలే లేవు, ఉన్న 4 ట్రంకు పెట్టెల తాళం చేతులు అధికారుల వద్ద లేక పోవడంతో వాటిని కూడా పగలగొట్టి తీశారు.  ఈ ప్రక్రియ సోమవారం తెల్లవారు 3.50 గంటల వరకు సాగింది. 2018 సాధరణ ఎన్నిక్లలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోకవర్గంలో అవకతవకలు జరిగాయంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హైకోర్టులో ఫిటిషన్‌ దాకలు చేశారు.  అప్పటి నుంచి విచారణ చేసిన హైకోర్ట్ ఈ నెల 10న  స్ర్టాంగ్‌ రూంను తెరిచి 17 సి, 17 ఎ ప్రత్రాలను స్కాన్ చేసి జిరాక్స్ ప్రతులను కోర్టుకు అందచేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 10 తేదీన స్ట్రాంగ్ రూం తెరిచేందుకు వెళ్లిన అధికారులకు తాళం చెవులు దొరలేదని 11న హైకోర్ట్ కు కలెక్టర్ నివేదించారు. దీంతో మరోసారి హైకోర్టు జోక్యం చేసుకుని తాళం పగులగొట్టాలని ఆదేశించటంతో ఆదివారం ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో తాళాలు పగలగొట్టి మరుసటి రోజు తెల్లవారు జమున 4 గంటల వరకు   అందులో ఉన్న పత్రాలను... స్కాన్‌ చేసి జిరాక్స్‌ తీసి ఒక సెట్టును సీల్డ్ కవర్ లో జిల్లా కలెక్టర్  తీసుకుని వెళ్లి  హైకోర్టుకు సమర్పించారు.

మాల్ ప్రాక్టిస్ జరిగింది... కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మన్ కుమార్ 
సోమవారం తెల్లవారు జమున 4 గంటలకు స్ట్రాంగ్ రూం నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ అడ్లూరి అభ్యర్థి లక్ష్మన్ కుమార్ మీడియా తో మాట్లడుతూ నాలుగున్నర ఏళ్లుగా స్ట్రాంగ్ రూమ్ తాళాలు లేకపోవడం..  జరగాల్సిన మాల్ ప్రాక్టీస్  జరిగిపోయింది. 17a 17c పూర్తి సమాచారాన్ని కోర్టులో సబ్మిషన్ చేశాక మా అడ్వకేట్ ద్వారా వాదోపవాదాలు జరుగుతాయి ఎన్నికలు జరిగాక ఈవీఎంలు తరలించినప్పుడు సీసీ కెమెరాలు, వీడియో కెమెరాలు ఉంటాయి ప్రతి నిమిషం వీడియో కెమెరాలు కవరేజ్ చేస్తారు. స్ట్రాంగ్ రూముకు సంబంధించి కాంపౌండ్ వాల్ నుంచి మొదలుకొని ఈ వేముల భద్రపరిచిన గదుల వరకు సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉంటుంది. కౌంటింగ్ జరిపే ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి సి సి ఫుటేజ్ వీడియో గ్రాఫర్ ఉంటాయి కానీ. మా దగ్గర ఎలాంటి వీడియోగ్రఫీ లేవని కలెక్టర్ సమాధానం ఇచ్చారు. ఈవీఎం లు  డైరెక్ట్ గా జగిత్యాలోని విఆర్ కే  కాలేజ్ స్ట్రాంగ్ రూముకు రాకుండా, ధర్మపురి జూనియర్ కళాశాలలో ఒకరోజు భద్రపరిచి మరుసటి రోజు తీసుకొని వచ్చారు. స్ట్రాంగ్ రూములకు రెండు తాళాలు వేయాల్సి ఉండగా వేయలేదు. ఒకే దగ్గర ఉండాల్సిన పేపర్లు స్ట్రాంగ్ రూమ్లో వేరువేరు చోట్ల ఉన్నాయి. ఆ కాగితాలు కూడా సీల్ లేకుండా ఉండడం అనుమానానికి తావిస్తున్నాయి. 2009కి సంబంధించిన 17సి  సీల్ లేదు... సీల్ లేకపోవడంతో నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. 2009 ఈవీఎంకు 17 సి కి ట్యాలి కావాలి.. ఒకవేళ కాకపోతే హైకోర్టులో మా అడ్వకేట్ ద్వారా సబ్మిషన్ చేస్తాం. కోర్టు ఫైన నమ్మకం ఉన్నది మాకు న్యాయం జరుగుతది. ఇన్ని పొరపాట్లు జరిగిన తక్షణమే రీకౌంటింగ్ చేసి తనకు న్యాయం చేయాలి. ఇన్ని తప్పిదాలు, అక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి.

కేంద్ర ఎన్నికల సంఘానికి లక్ష్మన్ కుమార్ పిర్యాద్....
 ధర్మపురి ఎన్నికల  రికౌంటింగ్ వ్యవహారం కి సంబందించి స్ట్రాంగ్ రూం తాళాలు లేకపోవడం,కౌంటింగ్ సమయంలో రికార్డ్ చేసిన విడియో ఫుటేజ్,మరియు సిసి టివి ఫుటేజ్ లేకపోవడం, స్ట్రాంగ్ రూం లోపల ట్రంకు పెట్టెలు సరైన క్రమంలో లేకపోవడం, వాటిలో కొన్ని బాక్సులకు మాత్రమే తాళాలు వేసి ఉండటం, 17సి కి సంబంధించిన పత్రాలకు సీల్ లేకపోవడం వంటి తదితర అంశాలపై సోమవారం రోజున టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ తో కలిసి జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షుడు. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాద్ చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ ను  కలిసి ఆయన ద్వారా  చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూ ఢిల్లీకి రిప్రసెంటేషన్ ని ఇచ్చారు. రికౌంటింగ్ విషయం లో జరిగిన అవకతవకల పైన  తప్పిదాల పైన విచారణ జరిపించి బాధ్యుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.అదే విధంగా రికౌంటింగ్ విషయంలో జరిగిన అవకతవకలపై త్వరలోనే డిల్లీ లోని కేంద్ర ఎన్నికల అధికారిని కలిసి దీని పైన పిర్యాదు చేస్తామని లక్ష్మన్ కుమారు తెలిపారు.