మన ఉత్పత్తుల - మన గౌరవం భవనం ప్రారంభించిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

మన ఉత్పత్తుల - మన గౌరవం భవనం ప్రారంభించిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
Minister Guntakandla Jagadish Reddy

భువనగిరి, ముద్ర ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మన ఉత్పత్తుల - మన గౌరవం భవనాన్ని  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు.  సోమవారం నాడు మంత్రి రిబన్ కట్ చేసి చేనేత ఉత్పత్తుల కేంద్రాన్ని పరిశీలించారు. సేంద్రియ ఉత్పత్తుల కేంద్రాన్ని సందర్శించి ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సేంద్రియ ఉత్పత్తులకున్న డిమాండ్ ను ఆయన వివరించారు.  మహిళా సంఘాలు  తయారు చేసిన మానవ ఉత్పత్తుల పరికరాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్బంగా  మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు ద్వారా జరుగుతున్నన ఉత్పత్తులు అన్ని కూడా ఇక్కడ అమ్ముకోవడానికి వారు అందరికి కావాల్సిన భవన నిర్మాణం  జిల్లా మినరల్ ఫండ్ కింద దాదాపు 20 లక్షలతో పూర్తి చేసి ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. జిల్లాకు సంబందించిన రైతులు ఆర్గానిక్ పంటలు పండించే  రైతులు కానీ స్వయం సహాయక సంఘాల మహిళలు , మెప్మా , గ్రామాలలో తయారు చేసే అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడికి  తెచ్చుకొని ఉచితంగానే స్టాల్ పెట్టుకొని అమ్ముకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.

గ్రామీణ ఉత్పత్తులు, మన ఉత్పత్తులు ప్రోత్సహించడానికి ఈ  జిల్లాలో  జిల్లా కలెక్టర్ చొరవతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది . జిల్లాలోని మహిళా సంఘాలు అందరు , అదే విధంగా రైతులు రసాయనిక ఎరువులు వాడకుండా  పండిస్తున్న  పంటలు కూడా ఇక్కడ విక్రయించుకోవచ్చునని ఆయన అన్నారు. దీని మహిళా సంఘాల సోదరీమనులు , ఆర్గానిక్ పంటలు పండిస్తున్న రైతులు  ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్ధికంగా ఎదగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,

భువనగిరి శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ , జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ రాజేష్ చంద్ర,  జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, గ్రంధాలయ చైర్మన్ అమరేందర్ గౌడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిని అనురాధ , జిల్లా హార్టీ కల్చర్ అధికారి అన్నపూర్ణ , ఇతర సంబంధిత అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.