లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్ లు పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్ లు పంపిణీ

వలిగొండ ముద్ర న్యూస్ : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ , విద్యార్థులకు సుమారు 7 లక్షల రూపాయల విలువైన 580  స్కూల్ బ్యాగ్ లు శుక్రవారం పంపిణీ చేశారు.  వలిగొండ మండల కేంద్రంలో ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ అలీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం లో లయన్స్ క్లబ్ నాయకులు దాచెపల్లి ప్రకాశ్ గుప్త, కాసుల వెంకటేశం, కొసనం రాంరెడ్డి, గోశిక కర్ణాకర్, వేముల హరిక్రిష్ణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాద్యాయులు ఆలకుంట శ్రీనివాస్, వెంకట్ రెడ్డి కిరణ్ కుమార్, జనార్దన్ రెడ్డి, శ్రీరాములు, వెంకటరమణ, వెంకటయ్య, శ్రీలత పాల్గొన్నారు.